మెగా హీరో ‘రిపబ్లిక్’ నుండి వీడియో సాంగ్‌ వచ్చేసింది..

86

దేవాకట్టా దర్శకత్వంలో మెగా హీరో సాయితేజ్ నటిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్’. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా తర్వాత సాయితేజ్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. అవినీతికి .. అన్యాయాలకు ఆశ్రయం కల్పిస్తున్న రాజకీయాల చుట్టూ అల్లిన కథ ఇది. ఇలాంటి రాజకీయాల తీరుపై నిరసన గళం వినిపించే ఒక పౌరుడి కథ ఇది. భారీ బడ్జెట్‌తో భగవాన్ – పుల్లారావు నిర్మించిన ఈ సినిమాలో, సాయితేజ్ జోడీగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. కీలకమైన పాత్రల్లో రమ్యకృష్ణ .. జగపతిబాబు కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను విడుదల చేశారు.

కాలేజ్ కుర్రాళ్లు పాడుకునేలా కంపోజ్ చేయబడిన ఈ పాట, టైటిల్ కి తగినట్టుగానే ఉంది. హక్కుల రెక్కలను విరిచేసి … రంగుల కలలను చెరిపేస్తున్నారు. స్వేచ్ఛ అనేది ఇంకా పంజరంలోనే బంధించబడి ఉంది అనే అర్థం వచ్చేలా ఈ పాట సాగుతుంది. రెహ్మాన్ సాహిత్యాన్ని అందించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు. అనురాగ్ కులకర్ణి బృందం ఆలపించిన ఈ పాటకు రాజు సుందరం కొరియోగ్రఫీని అందించారు.

Gaana of Republic - Lyrical | Sai Tej, Aishwarya Rajesh, Jagapathi Babu, Ramya Krishna | Mani Sharma