తమిళనాడు నూతన గవర్నర్‌గా మాజీ కేంద్ర మంత్రి..

148

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్‌ తమిళనాడు గవర్నర్‌గా నియమితులయ్యారు. కొన్ని రోజుల క్రితమే ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. గతంలో ఆయన కేంద్ర ఐటీ శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని రోజుల క్రితమే కేంద్ర కేబినెట్‌ను విస్తరించారు. ఈ నేపథ్యంలో మొత్తం 11 మంది కేంద్ర మంత్రులను మంత్రి మండలి నుంచి తొలగించారు. అందులో రవిశంకర్ ప్రసాద్ ఒకరు. అయితే కేబినెట్ విస్తరణకు కొద్ది గంటల ముందే రవిశంకర్ ప్రసాద్ రాజీనామా చేయడం ఆసక్తి కలిగించింది. ఈయనతో పాటు మరో సీనియర్ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా మంత్రి పదవికి రాజీనామా చేశారు.