కమల్‌ ‘విక్రమ్’ ఫస్ట్‌లుక్‌ అదిరింది..

35
Vikram first look

యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌, డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘విక్రమ్‌’. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. శనివారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో క‌మ‌ల్ హాస‌న్‌తో పాటు మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి, మ‌ల‌యాళ స్టార్ హీరో ఫ‌హాద్ ఫాజిల్ కూడా ఉన్నారు. కమల్‌హాసన్‌, విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌ ఈ పస్ట్‌లుక్‌లో గడ్డంతో రగ్డ్‌లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ముగ్గురు విలక్షణ నటులు.. డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపిస్తుండటం సినిమాపై అంచనాలు పెంచేసింది.

ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. పోస్ట‌రే ఈ రేంజ్‌లో ఉంటే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుంద‌ని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. అనిరుద్‌ రవిచంద్రన్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. త‌న కెరీర్‌లో 232వ చిత్రంగా వ‌స్తున్న విక్ర‌మ్‌ సినిమాను క‌మ‌ల్‌ స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నాడు.