కరోనా తర్వాత తొలి లంగ్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్

174
covid
- Advertisement -

కోవిడ్ తర్వాత దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న మొదటి లంగ్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇది. ఏపీలోని కర్నూల్ కి చెందిన 19 సంవత్సరాలు యువతికి సర్జరీ చేశారు. 11 నెలలు క్రితం కోవిడ్ భారిన పడి ఉపరితిత్తులు పాడేపోగా 3 నెలలు క్రితం నిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. లంగ్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని డాక్టర్లు తెలపగా ఆక్సిజన్ నుంచి వెంటిలేటర్ ,వెంటిలేటర్ నుంచి echmo వరకు వెళ్లింది యువతి.

ఇవాళ ఉదయం లంగ్స్‌ డోనర్ దొరికారని సమాచారం అందడంతో ఆపరేషన్‌కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు డాక్టర్లు. రేపు ఉదయం సర్జరీ చేయనున్నారు. 27వ తేదీన 47 సంవత్సరాలు మహిళ ఆక్సిడెంట్ తో మెడికవర్ ఆసుపత్రిలో చేరగా ఈ ఉదయం బ్రెయిన్ డెడ్ కావడంతో తెల్లవారుజామున 4 :30 కు సర్జరీ చేసి ఆ మహిళ అవయవాలను వివిధ ఆసుపత్రులకు తరలించారు.

ఈ ఉదయం 7:40 నిమిషాలు కు మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రి నుంచి 7:51 నిమిషాలకు పంజాగుట్ట నిమ్స్ కి చేరుకుంది. వెంటనే వైద్యలు సర్జరీ నిర్వహిస్తున్నారు.

- Advertisement -