ఆర్సీ 15..రిలీజ్ ఎప్పుడో తెలుసా?

44
rc 15

శంకర్ డైరెక్షన్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చరణ్‌కు ఇది 15వ సినిమా కాగా చెర్రీ సరసన కియారా అద్వాణీ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, మలయాళ హీరో సురేష్ గోపి నెగిటివ్ రోల్స్‌లో కనిపించనున్నారు. సునీల్, అంజలి, నవీన్ చంద్ర కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నారు. 170 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్‌పై హింట్ ఇచ్చారు రామ్ చరణ్‌. ఓ మీడియాతో మాట్లాడిన రామ్ చరణ్‌…శంకర్‌తో కలిసి పని చేసే ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నానని, శంకర్ వంటి దర్శకుడితో పని చేస్తున్నప్పుడు కొన్ని అద్భుతమైన కొన్ని ఫ్యాన్‌ బాయ్ క్షణాలను ఆనందించానని చెప్పాడు. ఆర్సీ 15 అనేది పొలిటికల్ డ్రామా. శంకర్ సర్ స్క్రిప్ట్, విజన్, ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఒక వ్యక్తిగా, నటుడిగా నాకు ఆనందకరమైన అనుభవం. ఫిబ్రవరి 2023లో సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనే ఆలోచన ఉంది అని చరణ్ తెలిపారు.