టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న లక్నో..

84
- Advertisement -

ఐపీఎల్​ 2022 సీజన్​లో భాగంగా నేడు ఆసక్తికర మ్యాచ్‌ జరుగుతోంది. చెన్నైసూప‌ర్ కింగ్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ మూడు కీలక మార్పులతో బరిలోకి దిగనుంది. ఇక, ఆస్ట్రేలియా బౌలర్ ఆండ్రూ టై లక్నో తరుఫున అరంగేట్రం చేయనున్నాడు. గతేడాది అత్యుత్తమ ప్రదర్శనతో విజేతగా నిలిచిన సీఎస్​కే.. ఈ సారి కూడా అదే ఉత్సాహంతో టైటిల్‌పై కన్నేసి లీగ్​లోకి ప్రవేశించింది. కానీ తొలి మ్యాచ్​లోనే ఓటమిని చవిచూసింది. ఆ మ్యాచ్​లో 131 పరుగులే చేసి ఘోర ఓటమిని మూటగట్టుకుంది.

తుది జ‌ట్లు :

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌: కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), క్వింట‌న్ డికాక్ (వికెట్ కీప‌ర్), ఇవిన్ లూయిస్, మ‌నీష్‌ పాండే, దీప‌క్ హుడా, అయూష్ బ‌దోని, కృనాల్ పాండ్యా, చ‌మీర‌, ఆవేష్ ఖాన్‌, ఆండ్రూ టై, ర‌వి బిష్ణోయ్.

చెన్నైసూప‌ర్ కింగ్స్‌: రుతురాజ్ గైక్వాడ్‌, రాబిన్ ఊత‌ప్ప, మొయిన్ అలీ, అంబ‌టి రాయుడు, రవీంద్ర జ‌డేజా(కెప్టెన్‌) , శివ‌మ్ దూబే, మ‌హేంద్ర‌సింగ్ ధోని (వికెట్ కీప‌ర్‌), డ్వేన్ బ్రావో, డ్వాయిన్ ప్రెటోరియస్, ముఖేష్ చౌదరి, తుషార్ దేశ్‌పాండే.

- Advertisement -