భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర..!

530
LPG cylinders price drop of more than Rs 160 per cylinder
- Advertisement -

వంట‌గ్యాస్ వినియోగ‌దారుల‌కు శుభవార్త. సిలిండ‌ర్ ధ‌ర భారీగా దిగివ‌చ్చింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర ఏకంగా రూ.214 త‌గ్గింది. ఈ త‌గ్గింపుతో ఎల్పీజీ సిలిండ‌ర్ ధ‌ర రూ.583 నుంచి ప్రారంభం కానుంది.నెలవారీ సమీక్షలో ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం వల్లే మెట్రో నగరాల్లో గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా తగ్గాయి. ఈ ధరలన్నీ మే ఒకటో తేదీ నుంచే అమల్లోకి వస్తుండడం గమనార్హం.

దీంతో హైదరాబాద్ మహానగరంలో 14.2 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.207 తగ్గి.. రూ.589.50 నుంచి ప్రారంభం కానుంది. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర సైతం రూ.336 తగ్గి.. రూ.988 నుంచి ప్రారంభం అవుతుంది.

ఇక ఢిల్లీలో ఎలీపీజీ సిలిండర్ ధర రూ.744 నుంచి రూ.581.50కి పడిపోయింది. ముంబై నగరంలో రూ.714.50 నుంచి రూ.579కి దిగొచ్చింది. కోల్‌కతాలో ఒక్కో సిలిండర్‌పై రూ.190 తగ్గి రూ.584.50 కాగా, చెన్నై నగరంలో రూ.569.50కు ధర పడిపోయింది. గత కొంత కాలంగా వరుసగా మూడో సారి సిలిండ‌ర్ ధ‌ర దిగివ‌చ్చింది.

- Advertisement -