ప్రతిపక్షాలు బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు..

462
Minister Talasani Srinivas Yadav Slams Congress Leaders
- Advertisement -

కరోనా వైరస్, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ రోజు మాసబ్ ట్యాంక్ పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో మటన్ రేట్లు అధిక ధరలకు అమ్ముతున్నారని మా దృష్టికి వచ్చింది. మటన్‌లో బీఫ్ మాంసం కలుస్తుంది అన్నది చాలా తప్పు. పలు మటన్ షాప్ లపై రైడ్స్ నిర్వహించి సీజ్ చేయడం జరిగింది. మనం ఇక్కడ తీసుకున్న నిర్ణయాలపై సెంట్రల్ మినిస్టర్ గిరి రాజ్ సింగ్ కాల్ చేశారు. పశుగ్రాసంపై డెయిరీ ఉత్పత్తులు, చాపల ఉత్పత్తిపై అరాతీసి అభినందించారని మంత్రి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ సెక్రటరీ మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్రంలో తీసుకున్న చర్యలను అభినందించారు. బీజేపీ వారు దీన్ని గమనించలి.. ఈ సమయంలో రాజకీయాలు చేస్తున్నారు. ఇక పనికి మాలిన దద్దమ్మలు కాంగ్రెస్ వాళ్ళు నెల తర్వాత ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ను ఈ దేశంలో ఎవ్వరు పట్టించుకోవట్లేదు. వారికి ఇప్పటికే ప్రజలు తగిన గుణపాఠం నేర్పారు. అఖిల పక్ష కమిటీకి అతి గతి లేదు అని మంత్రి ఎద్దేవ చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు. రైతులు ఇబ్బంది పడకూడదని వరి ,మొక్కజొన్న పంటలను స్వయంగా ప్రభుత్వం కొంటుంది. ఏ రాష్ట్రంలో కూడా ఇలా చేయట్లేదు అని తలసాని అన్నారు.

ఈ కష్టకాలంలో పేదలకు బియ్యంతో పాటు 1500 రూపాయలు ఇస్తున్నాం. వలస కూలీలను అదుకుంటున్నాం. బియ్యం, నగదు పంపిణీ రెండో విడత కూడా ప్రారంభమైంది. వలసకులీలను గమ్య స్థానాలను పంపించడానికి బస్సులు వద్దు ఇబ్బంది పడతారు అని చెప్పాను. రైళ్లు ద్వారా పంపించాలని సూచన చేశాను. ఇందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి మీ సూచనలు పటిస్తాము అని చెప్పారు. రాజస్థాన్ నుండి ఆంధ్ర మత్స్యకారులు వస్తే ఆంధ్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ ఫోన్ చేస్తే వారికి దిల్‌సుక్‌నగర్‌లో భోజన సదుపాయం కల్పించి వారిని పంపించామని మంత్రి తెలిపారు.

వలసకులీలు మన దగ్గర 15 లక్షల మంది ఉన్నారు. పొద్దున ఒక ట్రైన్ ద్వారా ఝార్ఖండ్ పోవడం జరిగింది. కేంద్రం ఏ సూచనలు చేసిన పాటిస్తున్నాం..కేంద్రానికి పూర్తిగా సహకరిస్తుంటే రాష్ట్ర బీజేపీ నాయకత్వం అవగాహన రాహిత్యముతో మాట్లాడుతున్నారు. బీజేపీ ఎంపీ రాష్ట్ర నాయకుడు బాధ్యతగా మాట్లాడాలి కేంద్రంలో ఉన్న మీ ప్రభుత్వం చెప్పిన దాన్ని తప్పు పడతార అని ప్రశ్నించారు. టెస్టులు ఎక్కువ చేయడం లేదు అన్నది అవాస్తవం. ప్రభుత్వం చాలా నిబద్ధతతో పని చేస్తుంది. ప్రతిపక్షాలు బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు. సెంట్రల్ టీం నాలుగు రోజులు రాష్ట్రంలో పర్యటించింది ఇక్కడ తీసుకుంటున్న చర్యల పట్ల హర్షం వ్యక్తం చేసిందని మంత్రి తలసాని పేర్కొన్నారు.

- Advertisement -