24న లవర్ ఆడియో

202
raj tharun

ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన హీరో రాజ్ తరుణ్. ఎంట్రీ సినిమాతోనే అదరగొట్టిన రాజ్‌ తరుణ్‌ తర్వాత సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ లాంటి వరుస విజయాలతో అలరించాడు. అయితే తర్వాత రంగులరాట్నం,రాజుగాడు,అందగాడు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలని లవర్‌గా ప్రేక్షకుల ముందుకువస్తున్నాడు.

ఇప్పటికే సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ ఆడియోని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈనెల 24న హైదరాబాద్‌లో ఆడియోను విడుదల చేయనున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

యూత్ కి నచ్చే ప్రేమకథాంశంతో నిర్మితమైన ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి ‘రిద్ధి కుమార్’ కథానాయికగా పరిచయమవుతోంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా లవర్‌ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. సినిమా టైటిల్‌కు తగ్గట్లుగానే హీరో,హీరోయిన్ల మధ్య రొమాంటిక్ లుక్‌తో కూడిన ఫస్ట్ లుక్‌ అందరిని ఆకట్టుకుంటోంది.

Lover Audio