వైజాగ్‌లో చినబాబు..అతిథిగా సూర్య

227
china babu
- Advertisement -

పాండిరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం చినబాబు. తెలుగు,తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కార్తీ సరసన సాయేషా సైగల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. గ్రామీణ కథాంశం నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా కార్తీ రైతు పాత్రలో కనిపించనున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ నెల 23న చినబాబు ఆడియో వేడుకను వైజాగ్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సీఆర్‌ రెడ్డి హాల్‌లో సాయంత్రం 5.30 గంటలకు ఆడియో రిలీజ్ కార్యక్రమం జరగనుండగా హీరో సూర్య ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

 karthi chinna babu

ఇటీవల విడుదలైన టీజర్‌తో సినిమాపై అంచనాలను పెంచేశాడు కార్తీ. రైతు సమస్యలపై పోరాడే పల్లెటూరి మొనగాడుగా ఆకట్టుకోనున్నాడు. ఈ టీజర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. కట్టప్ప సత్యరాజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా డి.ఇమాన్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -