AAAలో ఇలియానా..!

240
iliana

మాస్ మహారాజా రవితేజ, ఎంటర్ ఎంటర్టైన్మెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ శ్రీనువైట్ల, క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హోల్ సమ్ ఎంటర్ టైనర్ “అమర్ అక్బర్ ఆంటోనీ”. “నీకోసం, వెంకీ, దుబాయ్ శీను” లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత రవితేజ-శ్రీనువైట్లల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రవితేజ సరసన ఇలియాన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

కామెడీ హీరో సునీల్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ కథానాయకి లయ కుమార్తె శ్లోక, రవితేజ కుమారుడు మహాధన్ ల స్పెషల్ రోల్స్ “అమర్ అక్బర్ ఆంటోనీ” చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

నాజూకు నడుము అందాలతో టాలీవుడ్‌‌ను షేక్ చేసిన ఇలియానా సినిమా యూనిట్‌తో చేరింది. తొలుత ఈ చిత్రంలో అనూ ఇమ్మానుయేల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నప్పటికీ.. ఇలియానాతో రీ ప్లేస్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రవితేజ త్రిపాత్రాభినయం చేయనున్నారు. చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న శ్రీనువైట్లతో పాటు ఇలియానా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంతో హిట్ అందుకుంటారో లేదో చూడాలి.