టెర్రరిజం కంటే ప్రేమే ప్రమాదం

210
Love officially kills more people than terrorism
- Advertisement -

ప్రేమ …. రెండు అక్షరాల పదం. రెండు హృదయాలను కలిపే భావం. ఊహకు అందన భావన. కానీ ఇప్పుడు అదే ప్రేమ ఉగ్రవాదం కంటే భయంకరమైందిగా తయారైంది. ప్రేమ కోసం చావడం, చంపడం సహజంగా మారింది. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో దేశంలో ఉగ్రవాదం కంటే ప్రేమే అధికంగా చంపుతోందని వెల్లడైంది.

మీరు నమ్మకున్నా ఇది పచ్చి నిజం. భారత్‌లో ఉగ్రదాడుల్లో చనిపోయే వారి కంటే ప్రేమ కారణంగా చనిపోతున్న వారి సంఖ్యే అధికంగా ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించింది. 2001 నుంచి 2015 వరకు ప్రేమ కారణంగా 38,585 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులోనూ ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో ఇలాంటి కేసులు ఎక్కువగా ఉన్నాయి.

పశ్చిమ్‌బంగాలో కేవలం ప్రేమ కారణంగా 15,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 19 రాష్ట్రాల్లో ప్రేమ పేరిట ఆత్మహత్య చేసుకున్నవారిలో అబ్బాయిల కంటే అమ్మాయిలే సంఖ్యే ఎక్కువ. అదీకాకుండా పెళ్లి పేరిటకిడ్నాప్‌ చేసిన కేసుల సంఖ్య 2.6 లక్షలు. ఇవన్నీ వెలుగులోకి వచ్చిన గణాంకాలైతే హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో వెలుగులోకి రాని పరువు హత్యల సంఖ్య వూహించని స్థాయిలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రేమ చావులకు కులం, ధనిక, పేదరికాలే కారణంగా కనిపిస్తున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా ఆ కథనంలో పేర్కొంది.ఉగ్రవాదం కంటే ప్రేమ పెను ముప్పుగా మారడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.  అయితే ప్రేమను పంచాలి, తాము ప్రేమించిన వారు దక్కకపోతే, వారి క్షేమం , సంతోషం కోరాలే తప్ప చంపడాలు, చావడాలు సమస్యకు పరిష్కారం కావన్న విషయం నేటి యువత గుర్తించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -