స్పై.. మహేష్‌ లుక్ ఇదేనా..?

142
Mahesh Babu-AR Murugadoss movie title
Mahesh Babu-AR Murugadoss movie title

మహేష్‌బాబు సినిమా కోసం అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ‘బ్రహ్మోత్సవం’ సినిమా తర్వాత మహేష్ స్పీడ్‌ తగ్గిందని టాలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. కాస్త లేటయినా.. మురుగదాస్‌ తో ఓ సినిమాకి కమిటయ్యాడు మహేష్‌ . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ వియత్నాంలో జరుగుతోంది. అయితే ఈ సినిమాకు ఇంకా టైటిల్ ను కూడా ఎనౌన్స్ చేయలేదు. డిసెంబర్ నుంచి ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చాలా సార్లు వాయిదా పడింది. దీంతో అభిమానులు కూడా నిరుత్సాహపడుతున్నారు. అయితే ఈ ఉగాది సందర్భంగా తప్పుకుండా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని ఎదురుచూసిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది.

ఇక ఇప్పటివరకు చాలా పేర్లు ప్రచారంలో ఉన్నా, యూనిట్ సభ్యులు అఫీషియల్ గా కన్ఫామ్ చేయలేదు. మహేష్ బాబు కొత్త సినిమాకు స్పైడర్‌ టైటిల్ ని ఫిక్స్ చేశారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇంతకు ముందే ఈ టైటిల్ వినిపించినా.. నిర్మాతలు స్పై-డర్ ను రిజిస్ట్రేషన్ చేయించడంతోనే హంగామా మొదలైపోయిందని తెలుస్తోంది. దీంతో మహేష్‌ మూవీకి సంబంధించిన పోస్టర్‌ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Mahesh-Babu-Spyder-Fan-Made-First-Look-Poster

ఇప్పటికే పలు పోస్లర్లను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసి మహేష్‌ను ట్రెండింగ్‌లో ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు మహేష్‌ అభిమానులు. ఇక సినిమా టైటిల్ స్పైడర్ అని తెలిశాక ఊరుకుంటారా.. తమకు తెలిసిన టెక్నాలజీతో పోస్టర్లను నెట్ పెట్టేస్తున్నారు. వీటిలో ఒక పోస్టర్ మాత్రం సినిమాకు దగ్గరగా అనిపిస్తోంది. బ్లూ జీన్స్.. మెరూన్ కలర్‌ టీ షర్ట్‌.. డార్క్‌ గ్రీన్ జాకెట్‌లో ఉన్న మహేష్‌.. అదేవిధంగా మహేష్ వెనకాల పరుగుపెడుతున్నట్లుగా ఉన్న నీడ కనిపిస్తుంది. స్పై-డర్ టైటిల్ ని కూడా స్పైడర్ మ్యాన్ థీమ్ కి దగ్గరగా డిజైన్ చేసి.. మొత్తం పోస్టర్ ను అదే థీమ్ తో నింపేశారు. అయితే ఇది ఫ్యాన్ మేడ్ పోస్టరా.. కాదా అన్న విషయం పక్కన పెడితే.. ఇంటర్నెట్ లో ఇప్పుడిది వైరల్ అయిపోయింది.

ఇక ఈ సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈసినిమాలో మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది.