‘ల‌వ్ మీ’ ఓ డిఫ‌రెంట్ మూవీ :ఆశిష్

14
- Advertisement -

టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. . ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా మే 25న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా హీరో ఆశిష్‌తో ఇంట‌ర్వ్యూ విశేషాలు…

* ‘ల‌వ్ మీ’ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండ‌బోతుంది?

– ఇది వ‌ర‌కు చేసిన సినిమాలా కాకుండా ల‌వ్ మీ చిత్రంలో డార్క్ త‌ర‌హాలో నా క్యారెక్ట‌ర్ ఉంటుంది. యూనిక్ క్యారెక్ట‌ర్‌. ఎవ‌రైనా ఓ ప‌ని చేయొద్దని అంటే అదే ప‌ని చేసే పాత్ర‌లో క‌నిపిస్తాను. ఇందులో యూ ట్యూబ‌ర్‌గా క‌నిపిస్తాను. యూ ట్యూబ్‌లో స్టోరీస్ అప్‌లోడ్ చేసే హీరో ద‌గ్గ‌రికీ ఓ దెయ్యానికి సంబంధించిన స్టోరీ వ‌స్తుంది. అప్పుడు అత‌ని జీవితంలో ఏం జ‌రిగింద‌నేదే క‌థ‌. ఈ సినిమా కోసం డైరెక్ట‌ర్ అరుణ్‌తో ఎక్కువ‌గా మాట్లాడాను. ఆయ‌న హీరో పాత్ర ఎలా క‌నిపించాల‌నుకుంటున్నార‌నే విష‌యాల‌ను తెలుసుకున్నాను. అస‌లు హీరో ఏం ఆలోచిస్తున్నాడు.. ఏం చేస్తాడ‌నేది అత‌ని ప‌క్క‌నున్న వాళ్లే ఊహించ‌లేరు… నువ్వు నీలా ఉండు అని చెప్పే క్యారెక్ట‌ర్‌లో క‌నిపిస్తాను.

* ‘ల‌వ్ మీ ఇఫ్ యు డేర్’ సినిమాలో దెయ్యంగా క‌నిపించ‌బోయెదెవ‌రు?

– మా సినిమాలో దివ్యావ‌తినే దెయ్యం పాత్ర‌లో న‌టించింది. వైష్ణ‌వి మ‌రో హీరోయిన్‌గా క‌నిపిస్తారు. సినిమాలో ఐదారుగురు హీరోయిన్స్ ఉంటారు. సినిమా మొత్తంగా అంద‌రూ క‌నిపించ‌రు. చిన్న గెస్ట్ అయినా క‌నిపిస్తారు.

* డైరెక్ట‌ర్ అరుణ్ భీమ‌వ‌రుపు గురించి..?

– డైరెక్ట‌ర్ అరుణ్ ఓ న‌వ‌లా ర‌చ‌యిత‌. చాలా నెమ్మ‌ద‌స్తుడు. త‌ను స్టోరీని చ‌క్క‌గా నెరేట్ చేస్తాడు. ‘ల‌వ్ మీ’ స్టోరీని ఆయ‌న నాకు చెప్పిన‌ప్పుడు నా క్యారెక్ట‌ర్‌ను వివ‌రించిన తీరు నాకు బాగా న‌చ్చింది. ప్ర‌తీ విష‌యాన్ని ఒక్కొక్క‌రు ఒక్కోలా చూస్తార‌నే కాన్సెప్ట్ నచ్చింది. అలాగే దెయ్యంతో మాట్లాడ‌టం, రొమాన్స్ చేయ‌టం .. వంటి ఎలిమెంట్స్ డిఫ‌రెంట్‌గా అనిపించాయి. రాజుగారి రెఫ‌రెన్స్ లేకుండానే డైరెక్ట‌ర్‌గారు, మా ప్రొడ్యూస‌ర్ నాగ‌గారు వెళ్లి పి.సి.శ్రీరామ్‌గారిని క‌లిసి క‌థ చెప్పిన‌ప్పుడు ఆయ‌న వెంట‌నే సినిమా చేయ‌టానికి ఓకే చెప్పారు. అలాగే కీర‌వాణిగారు కూడా సినిమా చేయ‌టానికి ఒప్పుకున్నారు. అలా ఇద్ద‌రు లెజెండ్స్ మా సినిమా చేయ‌టానికి ఒప్పుకోవటంతో క‌థ కొత్త‌గా ఉంద‌నిపించింది. ముందు డైరెక్ట‌ర్ రాసుకున్న క‌థ‌ను చెప్పింది చెప్పిన‌ట్లు తీస్తాడా? అని కూడా ఆలోచించాం. అందుక‌ని ముందు 15 రోజులు షూటింగ్ చేస్తాం, బాగా వ‌చ్చిందంటే ముందుకెళ‌దాం.. లేక‌పోతే ఇంకా బెట‌ర్‌మెంట్ చేసుకుని వెళ‌దామ‌ని నిర్ణ‌యించుకున్నాం. 15 రోజుల త‌ర్వాత ఔట్‌పుట్ చూస్తే కొన్ని సీన్స్‌లో అయితే గూజ్ బ‌మ్స్ వ‌చ్చాయి.. నేచుర‌ల్‌గా కొన్ని సీన్స్ వ‌చ్చాయనిపించింది. దీంతో సినిమాను కంటిన్యూ చేశాం.

* ఈ సినిమా చేయ‌టానికి ముందు దెయ్యాల సినిమాలేమైనా చూశారు?

– ‘చంద్ర‌ముఖి’, ‘ముని’ వంటి సినిమాలు చాలానే చూశాను. ప్ర‌తి క్యారెక్ట‌ర్‌లో ఓ స‌మ‌స్య ఉంటుంది. నాదేమో స‌మ‌స్య‌కు ప‌రిష్కారాన్ని వెతుక్కునే పాత్ర. ఇందులో హార‌ర్ అనేది ఓ భాగం మాత్ర‌మే. ఇందులో మంచి ల‌వ్ స్టోరీ కూడా ఉంటుంది. ఇదేమో రివేంజ్ స్టోరీ కాదు. ఇందులో వైష్ణ‌వి దెయ్యం కాదు.. సినిమాలో చాలా స‌ర్‌ప్రైజ్‌లున్నాయి. ప్రేక్ష‌కులు ‘ల‌వ్ మీ’ సినిమా చూసిన త‌ర్వాత ఓ కొత్త, డిఫ‌రెంట్ మూవీ చూశామ‌ని థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వస్తారు.

* పి.సి.శ్రీరామ్‌, కీర‌వాణి వంటి స్టార్ టెక్నీషియ‌న్స్‌తో వ‌ర్క్ చేయ‌టం ఎలా అనిపించింది?

– కీర‌వాణిగారికి షూటింగ్‌కు రావాల్సిన అవ‌స‌రం లేదు.. అందుక‌ని ఆయ‌న ఓ రోజు మాత్ర‌మే సెట్స్‌కు వ‌చ్చారు. పి.సి.శ్రీరామ్‌గారితో వ‌ర్క్ చేయాల‌నుకున్న‌ప్పుడు తొలి రోజు టెన్ష‌న్ ప‌డ్డాను. ఎందుకంటే నాకైనా, వైష్ణ‌వికైనా రెండో సినిమానే. సరిగ్గా చేయ‌క‌పోతే శ్రీరామ్‌గారు ఏమైనా తిడ‌తారేమోన‌ని అనుకున్నాం. కానీ ఆయ‌న మ‌మ్మ‌ల్ని ఎలాంటి టెన్ష‌న్ పెట్ట‌లేదు. ఆయ‌న‌తో మాట్లాడిన త‌ర్వాత కూల్ అయ్యాం.

* సీక్వెల్ చేస్తారా?

– ‘ల‌వ్ మీ’ క్లైమాక్స్‌లో మంచి ట్విస్ట్ ఉంది.. స్టోరీ ప‌రంగా సీక్వెల్ చేసేలా ఉంది. అయితే సీక్వెల్ చేయాల‌ని మేం అనుకోలేదు. ఆ నిర్ణ‌యం దిల్ రాజుగారు తీసుకోవాలి.

* వైష్ణ‌వితో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌?

– నేను, వైష్ణ‌వి, ర‌వికిష‌న్‌, సిమ్ర‌న్‌, నాగా అరుణ్ అంద‌రం ఒక్కో సినిమానే చేశాం. అందరం స్టూడెంట్స్‌లాగానే భావించాం. నేను, వైష్ణ‌వి అయితే ..ఒక్కొక్క‌రి క్యారెక్ట‌ర్స్‌ను ఎలా చేయాల‌నే దానిపై బాగా డిస్క‌స్ చేసుకునే వాళ్లం. షూటింగ్ స‌మ‌యంలో మంచి ఫ‌న్ ఉండింది. వైష్ణవి మంచి కో స్టార్‌. స్క్రిప్ట్ రీడింగ్ నుంచి క‌లిసి ట్రావెల్ చేయ‌టం వ‌ల్ల మాకు మంచి క్లారిటీ ఉండేది.

నెక్ట్స్ సినిమాలేంటి?

– సెల్ఫిఫ్ సినిమా పూర్త‌య్యాక‌.. సితార బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయ‌బోతున్నాను.

Also Read:భార‌తీయుడు 2..లిరికల్ సాంగ్ ‘శౌర..’

- Advertisement -