మార్కెటింగ్ శాఖలో పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌..

41
telangana

మార్కెటింగ్ శాఖలో పదోన్నతులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు జీఓ 27 విడుదల చేసింది. 11 మంది గ్రేడ్ వన్ కార్యదర్శులకు స్పెషల్ గ్రేడ్ కార్యదర్శులుగా పదోన్నతి కల్పించనుంది. మార్కెటింగ్ సంచాలకుల కార్యాలయం నుండి మరో 21 మంది అసిస్టెంట్ కార్యదర్శుల నుండి గ్రేడ్ వన్ కార్యదర్శుల వరకు పదోన్నతులు ఇవ్వనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందనలు తెలిపారు.

మొత్తం 32 మందికి పదోన్నతులు కల్పించనున్నట్లు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని, శాఖాపరంగా ఉద్యోగులకు రావాల్సిన వాటి విషయంలో ఎక్కడా కాలయాపన ఉండదు ఆయన అన్నారు.మార్కెటింగ్ శాఖలో ప్రతి ఏటా క్రమం తప్పకుండా పదోన్నతులు ఇస్తున్నామని పేర్కొన్నారు.