TTD:గ‌జ వాహనంపై వేంక‌టేశ్వ‌ర‌స్వామి

6
- Advertisement -

శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శుక్ర‌వారం రాత్రి 7 గంట‌ల‌కు రాజ‌మ‌న్నార్ దండం ధ‌రించి చ‌క్ర‌వ‌ర్తి అలంకారంలో శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి గజవాహనంపై భ‌క్తుల‌కు అభ‌య‌మిచ్చారు.

వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఈ వాహ‌న‌సేవ ద‌ర్శ‌నం వ‌ల్ల క‌ర్మ విముక్తి క‌లుగుతుంద‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ఉత్స‌వాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి.

Also Read:పచ్చి కూరగాయలు తింటున్నారా?

- Advertisement -