లాంగ్ గ్యాప్.. మూడో సినిమా ఫిక్స్

9
- Advertisement -

సహజంగా ఒక సూపర్ హిట్ కొట్టిన దర్శకుడే ఎక్కువ గ్యాప్ లేకుండా చకచకా సినిమాలు చేసేసుకుంటున్నారు. అలాంటిది రెండు సూపర్ హిట్స్ అంటే ఇక ఆ దర్శకుడు ఎంతా స్పీడ్ గా వర్క్ చేయాలి ? కానీ వెంకీ కుడుముల విషయంలో అలా జరగలేదు. ఛలో తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న వెంకీ భీష్మ తర్వాత దాదాపు మూడేళ్ళ గ్యాప్ తీసుకున్నాడు. దీనికి కారణం లేకపోలేదు. భీష్మ తో నితిన్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడికి చాలా ఎడ్వాన్సులు దక్కాయి. ముఖ్యంగా రెండేళ్ల వెయిటింగ్ కి మెగా ప్రాజెక్ట్ సెట్ అయింది.

చిరంజీవి హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో నిర్మాత దానయ్య కొన్ని నెలల క్రితం సినిమా ఎనౌన్స్ మెంట్ ఇచ్చారు. అయితే వెంకీ కుడుముల చెప్పిన కథ చిరు కి నచ్చకపోవడం ఈ కాంబో మూవీ క్యాన్సిల్ అయింది. దీంతో వెంకీ ఆ డిప్రెషన్ నుండి బయటికి రావడానికి కాస్త టైమ్ పట్టింది. ఇప్పుడు ఫైనల్ గా తనకి రెండో అవకాశం ఇచ్చిన హీరో నితిన్ తో మూడో సినిమా సెట్ చేసుకొని తాజాగా ఎనౌన్స్ మెంట్ ఇచ్చేశాడు.

అయితే ఈ సినిమాకు కూడా తన రెండు సినిమాల హీరోయిన్ రష్మిక నే తీసుకున్నాడు. సొ భీష్మ కాంబో లో వస్తున్న రెండో సినిమా ఇది. మరి రెండు సూపర్ హిట్ల తో మంచి గుర్తింపు సక్సెస్ అందుకున్న వెంకీ కుడుముల మూడో సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతాడా ? చూడాలి.

ఇవి కూడా చదవండి…

NTR30 ఆచార్యతో పోలికేంటి ?

ఖుషి కి రిలీజ్ డేట్ ఫిక్స్

యావరేజ్ టాక్ తో అన్ని కోట్లా ?

- Advertisement -