యావరేజ్ టాక్ తో అన్ని కోట్లా ?

13
- Advertisement -

విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దాస్ కా ధమ్కీ’ ఉగాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ బజ్ తీసుకొచ్చాయి కానీ ఈ సినిమాకు మార్నింగ్ షో ఆశించిన ఓపెనింగ్ రాలేదు. మ్యాట్నీ షో నుండి విశ్వక్ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించగలిగాడు. ఈ వారం రంగమార్తాండ తప్ప మరో సినిమా లేకపోవడంతో ధమ్కీ మంచి వసూళ్లు రాబట్టింది.

మొదటి రోజు ఈ సినిమా యావరేజ్ టాక్ తో 8 కోట్లకు పైగా గ్రాస్ తెచ్చుకుంది. వరల్డ్ వైడ్ గా తొలి రోజు 8 కోట్ల 8 లక్షల గ్రాస్ అందుకొని విశ్వక్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ మూవీ అనిపించుకుంది. ఉగాది సెలవు కావడంతో సినిమా మంచి కలెక్షన్ రాబట్టింది. సినిమాలో విశ్వక్ నటన కి కామెడీ , ట్విస్టులకి మంచి మార్కులు దక్కాయి. దీంతో సినిమా ఈ వీకెండ్ వరకూ మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.

దసరా వరకు మరో సినిమా రిలీజ్ లేక పోవడం లాంగ్ వీకెండ్ కలిసిరావడంతో ఈ సినిమా మరో రెండు మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయే ఛాన్స్ కనిపిస్తుంది. చూడాలి ఈ సినిమాతో విశ్వక్ ఫైనల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తాడో ?

ఇవి కూడా చదవండి…

దేవకన్య సమంతలా దిగొచ్చింది

మే 18..సామజవరగమన విడుదల

రేపట్నుంచి సైంధవ్ షూటింగ్‌ షురూ.!

- Advertisement -