ఈఎస్‌ఐ స్కాం…రూ.4 కోట్లు స్వాధీనం!

141
esi

రాష్ట్రంలో సంచలనం సృష్టించి ఈఎస్‌ఐ స్కాంలో మరో ముందడుగు పడింది.ఈ కేసులో ప్రధాన నిందితులైన ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి, ఫార్మాసిస్ట్ నాగలక్ష్మికి చెందిన రూ. 4 కోట్ల ఆస్తులను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులిద్ద‌రూ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించిన అధికారులు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుండి రూ. 4 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.అక్రమంగా సంపాదించిన కోట్ల రూపాయలతో దేవికారాణి విలువైన ఆభరణాలు కొన్నారని, విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఏసీబీ తన దర్యాప్తులో గుర్తించింది. దేవికారాణి ఫార్మాసిస్ట్‌ నాగలక్ష్మితో కలిసి రెండు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారు. నాగలక్ష్మి బంధువైన ఎం.మురళీకృష్ణ పేరుతో మహీధర మెడికల్‌ అండ్‌ సర్జికల్‌ కంపెనీ, అతని భార్య విజయలక్ష్మి పేరుతో జై సాయిరాం డిస్ట్రిబ్యూటర్స్‌ ఏర్పాటు చేశారు.