రైలు సేవల పునరుద్దరణకు రైల్వేశాఖ కసరత్తు..

153
railways

సాధారణ ప్రయాణీకుల రైలు సేవల పునరుద్ధరణకు కసరత్తు మొదలు పెట్టింది రైల్వే శాఖ.ప్రస్తుతం నిర్ధేశించిన మార్గాలతో పాటు మరి కొన్ని ముఖ్యమైన స్టేషన్ల మధ్య 230 రైళ్లు నడుపుతున్న రైల్వేశాఖ..మరో 100 రైళ్ళను పట్టాలెక్కించేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం.

ఈ మేరకు హోంశాఖకు రైల్వే శాఖ ప్రతిపాదనలు పంపింది.హోంమంత్రిత్వ శాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే రైళ్లు ప్రారంభమవుతాయని వెల్లడించారు అధికారులు.రాష్ట్రాల సమన్వయంతో ప్యాసింజర్ రైలు సర్వీసులు ప్రారంభించనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.

దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తూ.. ఎక్కువగా ప్రయాణీకులు ఉండే మార్గాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు రైల్వే వర్గాల సమాచారం.పలు పట్టణాల్లో సబర్బన్‌ రైళ్లు నడిపేందుకు కూడా ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.