విజయ్ మాల్యాకు షాకిచ్చిన లండన్ కోర్టు..

185
vijay

లిక్కర్ కింగ్,ఆర్ధిక నేరగాడు విజయ్ మాల్యాకు చుక్కెదురైంది. భారత్‌లో బ్యాంకులకు రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన మాల్యా దివాలా తీసినట్లు ప్రకటించింది లడన్ కోర్టు. మాల్యా దివాళా తీసినట్లు తీర్పు ఇస్తున్నాను అంటూ జడ్జి మైఖేల్ బ్రిగ్స్ వ్యాఖ్యానించారు. త్వరలోనే మాల్యాను భారత్‌కు అప్పగిస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో లండన్ కోర్టు ఇచ్చిన తీర్పు ఆసక్తికరంగా మారింది.

మాల్యా హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అప్పీల్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, దానికి అనుమతి నిరాకరించారు. అయితే, మాల్యా ఆస్తులను బ్యాంకులు స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం భారత బ్యాంకుల వద్ద తీసుకున్న రూ. 9 వేల కోట్ల రుణాలకు సంబంధించి విజయ్ మాల్యా మనీ ల్యాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.