అర్హులందరికీ..తల్లికి వందనం

3
- Advertisement -

‘తల్లికి వందనం’ పథకంపై వైసీపీ ఎమ్మెల్సీలకు నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా తల్లికి వందనం లబ్ధిదారులు ఎంత మంది అంటూ శాసనమండలిలో ప్రశ్నించారు వైసీపీ సభ్యులు.

అమ్మ ఒడి రాలేదు.. తల్లికి వందనం వస్తోందంటూ వైసీపీ ఎమ్మెల్సీలకు మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి పేరిట కొందరికే పథకాన్ని పరిమితం చేశారని విమర్శలు చేశారు.

తల్లికి వందనం కింద కూటమి ప్రభుత్వం ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేలు ఇస్తోందని వివరణ ఇచ్చారు. ఇక అంతకముందు మీడియాతో చిట్ చాట్ సందర్భంగా శాసనమండలిలో ఒక ప్రశ్న అడిగితే వైసీపీ సభ్యుల నుంచి సమాధానం లేదు… జీఎస్టీకి అనుకూలమా, వ్యతిరేకమా అన్న ప్రశ్నకు వైసీపీ మూగబోయింది అన్నారు. ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక ఎమ్మెల్సీలంతా విచ్ఛిన్నమయ్యారు…ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పెట్టిన వైసీపీ ఆ అంశంపై వాయిదా తీర్మానమా? అని ఎద్దేవా చేశారు.

Also Read:BB9:నామినేషన్స్‌లో ఉంది వీరే!

- Advertisement -