BB9:నామినేషన్స్‌లో ఉంది వీరే!

7
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు విజయవంతంగా 15 రోజులు పూర్తి చేసుకుంది. ఇక మూడో వారం నామినేషన్స్ ప్రక్రియ వాడివేడిగా సాగింది. సెలబ్రెటీల్లో నలుగుర్ని నామినేట్ చేసేసిన తర్వాత తమలో తాము ఎవరిని నామినేట్ చేయాలా అని టాపిక్‌ రావడంతో ముందుగా హరీష్ మాట్లాడుతూ నా వైపు నుంచి అయితే ప్రియ అనుకుంటున్నాను అని చెప్పారు. ప్రియ ఎందుకంటే అని తన పాయింట్స్ చెప్పాడు హరీష్‌.

ఆ తర్వాత వెంటనే ప్రియ నా నామినేషన్ హరీష్ .. అంటూ చెప్పింది. మీ పర్సనల్ అయినా కూడా ఏదైనా కూడా మీరు ఫుడ్ తినకుండా ఉండటమనేది నాకు అసలు నచ్చలేదు అని తన రీజన్స్ చెప్పుకొచ్చింది. ఇద్దరి వెర్షన్ విన్న తర్వాత దమ్ము శ్రీజ తన అభిప్రాయం చెప్పింది. ఇద్దరితో పోలిస్తే హరీష్ పాయింట్లే బలంగా ఉన్నాయి.. కనుక నేను కూడా ప్రియ అనుకుంటున్నాను అని చెప్పింది.

డీమాన్ పవన్ అయితే నా దృష్టిలో ఇద్దరివీ రాంగ్ ఉన్నాయి.. అయితే ఆయన పాయింట్స్ కొంచెం వ్యాలిడ్‌గా ఉన్నాయి.. వాటిని నువ్వు సరిగా డిఫెండ్ చేసుకోలేదు అనిపించింది.. అంటూ ప్రియనే సెలక్ట్ చేశాడు. ఇంతలో ఒక్క క్షణం అంటూ హగ్ ఇచ్చాడు హరీష్. దీంతో వెంటనే పవన్ కళ్యాణ్ ఏడ్చేశాడు. సరైన టైమ్‌లో స్టాండ్ తీసుకోకపోవడం వల్ల జీవితాలు ఏమైపోతాయో అర్థమవుతాయి అంటూ హరీష్ క్లాస్ పీకాడు.

నాకు ఏం అనిపించిందంటే ఇండివీడ్యూవల్‌గా ఆన్సర్ చేసుకునే స్కోప్ రాలేదు.. అని డీమాన్ అన్నాడు. దీనికి మీరు స్టాండ్ తీసుకోలేదని కొశ్చన్ చేసినందుకు ఐయామ్ సారీ..మీరు సినిమా చూస్తూ ఉండండి.. నేను ఫైట్ చేస్తా.. అంటూ హరీష్ సీరియస్ అయ్యాడు. దీంతో ఇక్కడికి వచ్చింది నామినేషన్స్‌కి సార్ పాయింట్లు పెడతాం కదా.. అని పవన్ అనగానే రీతూ టాపిక్ తీసుకొచ్చాడు హరీష్.

టెనెంట్స్ నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓనర్లయిన సెలబ్రెటీలకి ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఓనర్లకి నేను ఒక పవర్ ఇస్తున్నాను. టెనెంట్స్ నామినేట్ చేసిన వారిలో ఇద్దర్ని తీసేసి రెండు కొత్త నామినేషన్స్ చేయండి అని చెప్పాడు బిగ్ బాస్. దీంతో ఓనర్లంతా చర్చించుకొని.. తమ నుంచి రీతూ చౌదరి, రాము రాథోడ్‌లని నామినేట్ చేయాలని అనుకున్నారు. ఇక వాళ్లు కూడా దీనికి అంగీకరించారు. దీంతో సంజన, సుమన్ శెట్టిల పేర్లు తీసేసి ఆ ప్లేస్‌లో టెనెంట్స్ నుంచి పవన్ కళ్యాణ్, ప్రియలని నామినేట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇలా నామినేషన్స్ పూర్తయ్య సరికి పవన్ కళ్యాణ్,ప్రియ,హరీష్,రీతూ చౌదరి,ఫ్లోరా సైని, రాము రాథోడ్ నామినేషన్స్‌లో ఉన్నారు.

Also Read:వెంకీ- త్రివిక్రమ్‌..షూటింగ్ అప్‌డేట్!

- Advertisement -