దళపతి విజయ్ నటిస్తున్న దళపతి67 సినిమా యొక్క లెటెస్టే ఆప్‌డేట్ ఇచ్చింది. ఇందులో మరో స్టార్ డైరెక్టర్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు ప్రకటించారు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఇది వరకే ప్రకటించినట్టు సంజయ్ దత్‌తో పాటుగా మరో విలన్ కూడా చేరారని చెప్పారు. లోకేష్‌కనగరాజ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గౌతమ్ మీనన్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్టు ప్రకటించారు. అంతకుముందే గౌతమ్ దీనిని ఇదే ఇంటర్వ్యూలో ప్రకటించారు. దీంతో విజయ్‌తో ప్రతినాయక పాత్రలను ఇద్దరూ షేర్ చేసుకుంటున్నారని కన్ఫమ్ చేశారు.
ఈ సినిమాలో సంజయ్‌దత్, సుకుమారన్, త్రిష, అర్జున్‌సార్జా, మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఇది జనవరి నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుందని కూడా ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ప్రస్తుతం విజయ్ వారసుడు సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. లోకేష్ దళపతి సినిమా పూర్తవగానే… విక్రమ్2, ఖైదీ2 షెడ్యూల్ కూడా చేసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి…