బాలయ్య.. ఫుల్ అనిల్ స్టయిల్ లోకి

326
- Advertisement -

దర్శకుడు అనిల్ రావిపూడి స్టయిల్ అంటూ ఒకటి వుంది. హీరో ఎవరైనా ఆ స్టయిల్ లోకి వెళ్లిపోవాల్సిందే. సినిమా ఏదైనా అది అనిల్ రావిపూడి కామిక్ స్టయిల్ లోనే వుంటుంది. వచ్చే నెలలో స్టార్ట్ కాబోతున్న అనిల్ రావిపూడి – బాలయ్య సినిమా స్క్రిప్ట్ చూసిన సాంకేతిక బృందం.. ఇవే మాటలు చెబుతున్నారు. స్క్రిప్ట్ పక్కా అనిల్ రావిపూడి స్టయిల్ లో వుంది. ఎటొచ్చీ ఈసారి బాలయ్య ఫిల్మ్ కనుక మరింత…మరింత భారీగా వుంది. స్క్రిప్ట్ లో యాక్షన్ ను ఫుల్లీ ప్యాక్డ్ గా రెడీ చేసారట. రిపీట్ సీన్స్ అనిపించకుండా బాలయ్య క్యారెక్టర్ లో కావాల్సిననన్ని వేరియేషన్స్ ను కూడా యాడ్ చేసారట.

అందువల్ల పక్కా పైసా వసూల్ సినిమా అవుతుంది అనేది అనిల్ రావిపూడి టీమ్ నమ్మకం, మరియు అభిప్రాయం. అయితే, ఇక్కడే చాలా అనుమానాలు ఉన్నాయి. స్క్రిప్ట్ మొత్తం భారీ యాక్షన్ ఫీస్ట్ అన్నట్లుగా యాక్షన్ సీన్లతో కథను నింపారు. మధ్యలో అనిల్ రావిపూడి కామెడీ స్టయిల్ ఎలాగూ ఉంటుంది. కానీ.. బాలయ్యను కొత్తగా కూడా చూపించాల్సిన అవసరం ఉంది. అఖండ లో బాలయ్య అఘోరాగా కొత్తగా కనిపించే సరికే ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. అన్నట్టు ఈ సారి హీరోయిన్ తో బాలయ్యకి రొమాన్స్ సీన్లను కూడా పెట్టారు అనిల్.

ఓవరాల్ గా అనిల్ రావిపూడి పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాని చూస్తే.. బాలయ్య ఫుల్ మాసీగా, మాన్లీగా కనిపించబోతున్నాడు. పైగా బాలయ్య క్యారెక్టర్ కు కొద్దిగా మతిమరుపు వుంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ మతిమరుపుతో అటు ఆర్టిస్టిక్ కామెడీని కూడా బాగా పిండనున్నారు. మొత్తమ్మీద నటసింహం బాలయ్య కోసం దర్శకుడు అనిల్ రావిపూడి మరో సూపర్ హిట్ సినిమాని రెడీ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్యకి కూతురిగా శ్రీలీల నటించబోతుంది. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకం అట.

ఇవి కూడా చదవండి…

నాగార్జునతో నరేష్ ఫిక్స్ ?

ప్రభాస్ ఫ్యాన్స్‌ కు డబుల్ కిక్ !

మొన్న వీరసింహా రెడ్డి , ఇప్పుడు వీరయ్య

- Advertisement -