బన్నీతో ఆ తర్వాత విక్రమ్‌తో!

49
- Advertisement -

లోకేష్ కనగరాజ్ విజయ్ తో చేస్తున్న లియో సినిమా తర్వాత, అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని ఇప్పటికే ఓ వార్త హల్‌ చల్ చేస్తోంది. ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుందని, ఫస్ట్‌ పార్టులో అల్లు అర్జున్, రెండో పార్టులో విక్రమ్ లీడ్ రోల్‌లో కనిపించనున్నారంటూ క్రేజీ అప్‌డేట్ తెరపైకి వచ్చింది. కోలీవుడ్ టాలెంటెడ్‌ డైరెక్టర్ల జాబితాలో లోకేష్ కనగరాజ్ టాప్‌ ప్లేస్‌లో ఉంటాడు. ఈ దర్శకుడు అల్లు అర్జున్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.

లోకేష్ కనగరాజ్ బన్నీతో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా మొదలుపెట్టనున్నట్టు టాక్‌. దీనిపై త్వరలో లోకేష్ కనగరాజ్ టీం ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. పుష్ప 2 తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమా మీదకు వెళ్లనున్నాడు. మరి బన్నీ – లోకేష్ కనకరాజ్ క్రేజీ కాంబినేసన్ సిల్వర్ స్క్రీన్‌పై నిజంగానే సందడి చేయనుందా ?, చేస్తే.. లోకేష్ కనగరాజ్ జాక్ పార్ట్ కొట్టినట్టే.

లోకేష్ కనగరాజ్ 2014లో ‘కస్టమర్ డిలైట్’ షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఆ షార్ట్ ఫిల్మ్ కు ఓ కార్పొరేట్ ఫిల్మ్ కాంపిటీషన్లో మొదటి ప్రైజ్ వచ్చింది. ఆ కాంపిటీషన్ న్యాయనిర్ణేతగా సినీ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు, అలా ఆయనతో ఏర్పడిన పరిచయంతో 2016లో కార్తీక్ సుబ్బరాజు నిర్మించిన ‘అవియల్’ అనే ఇండిపెండెంట్ ఆంతాలజీ సినిమాలో ‘కాలం’ అనే ఒక ఎపిసోడ్ కి దర్శకత్వం వహించి సక్సెస్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -