మలయాళ మూవీ ‘లోకహ్’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం దక్షిణ భారతదేశంలో మహిళా కథానాయిక ఆధారంగా తెరకెక్కిన సినిమాలలో 100 కోట్ల మార్క్ దాటిన తొలి చిత్రంగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు, ఈ మైలురాయిని చేరుకున్న మూడవ వేగవంతమైన మలయాళ సినిమాగా కూడా నిలిచింది.
డొమినిక్ అరుణ్ ఈ సినిమాను రాశి, దర్శకత్వం వహించారు. కథ మొదటి నుంచి చివరి వరకు ఆకట్టుకుంటుంది. తక్కువ బడ్జెట్‌లో తీశినా కూడా అది ఎక్కడా కనిపించదు, చాలా మెరుగ్గా, నాణ్యతతో కనిపిస్తుంది. తెలుగులో, తమిళంలో కూడా బాగా ఆడుతుండగా, ప్రేక్షకుల స్పందనతో మొత్తం బృందం ఆనందంగా ఉంది.
ఇక, హిందీ వెర్షన్ సెప్టెంబర్ 4, 2025న థియేటర్లలో విడుదల కానుండటంతో ఉత్తర భారత ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో అన్న ఆసక్తి పెరిగింది. ఈ సినిమాలో టోవినో థామస్, సన్నీ వేన్, దుల్కర్ సల్మాన్ కనిపించడం అభిమానులను ఆనందింపజేస్తోంది. సాండీ మాస్టర్ విలన్‌గా నటించగా, జేక్స్ బీజోయ్ సంగీతం అందించారు.
Also Read:తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష

