పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ త్వరలోనే గ్రీస్‌కు వెళ్లి “ది రాజా సాబ్” సినిమా పెండింగ్‌లో ఉన్న పాటల చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు. ఈ సినిమా తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ చేయనున్నారు ప్రభాస్. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారని టాక్ నడుస్తోంది.
అయితే బాలీవుడ్ వర్గాల్లో ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమా ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా, ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్‌ను వెంబడించే పోలీస్ ఆఫీసర్ కథగా ఉంటుందని తొలుత ప్రచారం జరిగిన తాజాగా థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.
ప్రభాస్ ఎందుకు వరుసగా మరో హారర్ జానర్ సినిమా చేస్తారని ఆశ్చర్యపోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ప్రణయ్ రెడ్డి వంగా మరియు టి-సిరీస్ కలిసి నిర్మించనుండగా, సంగీతాన్ని హర్షవర్ధన్ రమేశ్వర్ అందించనున్నారు.
Also Read:GST..ఏఏ వస్తువులపై ఎంతంటే?

