KTR:రేవంత్ నిజాయితీగల మోసగాడు

6
- Advertisement -

రేవంత్ రెడ్డి నిజాయితీగ‌ల్ల మోస‌గాడు.. ప్ర‌జ‌లు మా చేతుల్లో మోస‌పోవాల‌ని కోరుకుంటారు అని రేవంత్ రెడ్డి అన్నాడు.. అదే చేశాడు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.ఖ‌మ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత ఊకంటి ప్ర‌భాక‌ర్ రావుతో పాటు 300 మంది కార్య‌క‌ర్త‌లు కేటీఆర్ స‌మ‌క్షంలో చేరారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నిక‌ల ముందు హామీల జాతర‌.. ఎన్నిక‌ల త‌ర్వాత‌ చెప్పుల జాత‌ర అన్నారు. సింగ‌రేణి కార్మికుల‌కు కేసీఆర్ చేసిన మేలు ప్ర‌భాక‌ర్ రావు వివ‌రంగా చెప్పారు. కానీ ఆశ్చ‌ర్యం ఏందంటే సింగ‌రేణి బెల్ట్‌లో ఉన్న 13 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓడిపోయాం…. ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంప‌ల్లి, చెన్నూరు మంచిర్యాల‌, గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతంలోని రామ‌గుండం, మంథ‌ని, భూపాల‌ప‌ల్లి, ఖ‌మ్మం జిల్లాలోని ఇల్లందు, స‌త్తుపల్లి, కొత్త‌గూడెంలో ఒక్క సీట్లో కూడా గెల‌వ‌లేదు అన్నారు.

సింగరేణి కార్మికులకు ఇచ్చిన 10 హామీల్లో 8 హామీలు పూర్తి చేశాం…. రెండు పాక్షింగా మిగిలాయాని చ‌ర్చించాం అన్నారు. ప్ర‌స్తుత ప్ర‌భుత్వ తీరు అగ‌మ్య గోచ‌రంగా ఉంద‌ని అంటున్నారు. ముఖ్యంగా రైతులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. యూరియా సంక్షోభం తీవ్రంగా ఉంది. రాత్రి పూట‌నే లైన్లు క‌డుతున్నారు. భ‌యంక‌రంగా చెప్పులు క‌న‌బ‌డుతున్నాయి అన్నారు.

Also Read:GST..ఏఏ వస్తువులపై ఎంతంటే?

 

- Advertisement -