దేశ వ్యాప్తంగా 14రాష్ట్రాలు, రెండు కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతాల్లోని 116 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా జరగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మూడో దశ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. భువనేశ్వర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తన భార్య అంజలితో కలిసి ఓటేశారు. అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. కన్నూరు జిల్లాలోని పినరయిలో ఆర్‌సీ అమల బేసిక్ పాఠశాలలో ఓటేశారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అమిత్ షా తన భార్య సోనాల్ షాతో కలిసి రనిప్‌లోని నిషాన్ హైయర్ సెకండరీ స్కూల్‌లో ఓటేశారు. కాగా సామాజిక కార్యకర్త అన్నాహజారే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మద్ నగర్ జిల్లాలోని రాలేగావ్ సిద్దిలో ఏర్పాటుచేసిన పోలింగ్‌బూత్‌లో ఓటు వేశారు. ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ అహ్మదాబాద్‌లో ఓటు వేశారు.
Gujarat Chief Minister Vijay Rupani and wife Anjali cast their vote at a polling booth in Anil Gyan Mandir school in Rajkot #LokSabhaElections2019 pic.twitter.com/miLteXNl9X
— ANI (@ANI) April 23, 2019
PM Narendra Modi after casting his vote at a polling booth in Ranip,Ahmedabad #Gujarat #LokSabhaElections2019 pic.twitter.com/B6jDiRf2ka
— ANI (@ANI) April 23, 2019
Gujarat: BJP President Amit Shah and his wife Sonal Shah cast their votes at polling booth in Naranpura Sub-Zonal office in Ahmedabad pic.twitter.com/0lNdyv0XDp
— ANI (@ANI) April 23, 2019
Chief Minister of Odisha Naveen Patnaik casts his vote at a polling booth in Bhubaneswar. #LokSabhaElections2019 #OdishaElections2019 pic.twitter.com/DzBcLHFVZa
— ANI (@ANI) April 23, 2019
Gujarat: Heeraben Modi, Prime Minister Narendra Modi's mother casts her vote at a polling station in Raisan, Ahmedabad. #LokSabhaElection2019 pic.twitter.com/Mc8ZkOQwd1
— ANI (@ANI) April 23, 2019