రాష్ట్రంలో కఠినంగా లాక్‌డౌన్‌…రిజిస్ట్రేషన్లు బంద్

50
ts

రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. నేటి నుండి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమల్లో ఉండనుండగా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం. హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిన వారు బయటతిరిగితే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అటువంటి వారిని ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించనున్నట్లు తెలిపింది.

ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్నీ కార్యకలాపాలకు అనుమతి ఉండగా పది రోజుల పాటు వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. పది రోజుల పాటు రిజిస్ట్రేషన్లు చేయవద్దని రిజిస్ట్రేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి 22వ తేదీ వరకు ఆదేశాలు అమలు కానున్నాయి.