కర్టన్ల కంపెనీలో అగ్ని ప్రమాదం..

85
up

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘ‌జియాబాద్‌లోని కార్ల కంపెనీలో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఘ‌జియాబాద్‌లోని కావిన‌గ‌ర్ పారిశ్రామిక పార్కులో ఉన్న‌ ఓ క‌ర్ట‌న్ల త‌యారీ ప‌రిశ్ర‌మ‌లో బుధ‌వారం ఉద‌యం మంట‌లు చెల‌రేగాయి. క్ర‌మంగా అవి ఫ్యాక్ట‌రీ మొత్తం విస్త‌రించగా సమీపంలోని కంపెల‌కు మంట‌లు వ్యాపించాయి.

దీంతో వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది పది ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పారు. క‌ర్ట‌న్ల కంపెనీలో అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో భారీగా పొగ‌లు క‌మ్ముకోగా ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.