మే 3 వరకు రాజస్థాన్‌లో లాక్‌డౌన్..!

39
rajasthan

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు రికార్డు స్ధాయిలో కేసులు నమోదవుతుండగా పలు చోట్ల నైట్ కర్ఫ్యూ,కొన్ని చోట్ల తిరిగిలాక్ డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లో ఇవాళ్టి నుంచి 15 రోజ‌ల పాటు లాక్‌డౌన్ అమ‌లు చేయ‌నున్నారు. మే 3వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ఆంక్ష‌లు రాష్ట్ర‌మంతా పాటించ‌నున్నారు.

నిత్యావ‌స‌ర వ‌స్తువుల షాపులు సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు తెరిచి ఉంటాయి. కూర‌గాయ‌లు రాత్రి ఏడు వ‌ర‌కు అమ్మే అవ‌కాశం క‌ల్పించారు. పెట్రోల్ పంపులు రాత్రి 8 వ‌ర‌కు తెరిచి ఉంటాయి.

మాల్స్‌, షాపింగ్ కాంప్లెక్స్‌లు, సినిమా హాళ్లు, ఆల‌యాల‌ను మూసివేశారు. అన్ని విద్యా కేంద్రాలు, కోచింగ్ సెంట‌ర్లు, లైబ్ర‌రీలను కూడా మూసి వేశారు.గ‌ర్భిణులు హాస్పిట‌ళ్ల‌కు ప్ర‌యాణించే అనుమ‌తి ఇచ్చారు. పెళ్లి, అంత్య‌క్రియ‌ల‌కు 50 మందికి ప‌ర్మిష‌న్ ఇచ్చారు.