మాహేష్ డైరెక్టర్‌తో మెగాస్టార్‌..?

52
Chiranjeevi

దర్శకుడు వంశీ పైడిపల్లి ‘మహర్షి’ సినిమా తరువాత అనుకున్నంత త్వరగా మరో ప్రాజెక్టును పట్టాలెక్కించలేకపోతున్నాడు. అయితే గతంలో ఎన్టీఆర్ .. చరణ్ .. మాహేష్ బాబు వంటి యంగ్ స్టార్ హీరోలకు భారీ విజయాలను అందించిన వంశీ పైడిపల్లి, నాగార్జున వంటి సీనియర్ స్టార్ హీరోకు కూడా ఘన విజయాన్ని అందించాడు. అలాంటి ఆయన రీసెంట్ గా చిరంజీవిని కలిసి ఒక కథను వినిపించినట్టుగా తెలుస్తోంది.

Vamshi Paidipally

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక కథను రాసుకున్నాడట వంశీ. ఆ కథను వెళ్లి చిరంజీవికి చెప్పడం కూడా జరిగిందట. అయితే కథ చెబుతున్నంత సేపు కూడా చాలా పాజిటివ్ గా చిరంజీవి స్పందించారని తప్పకుండా ప్రాజెక్ట్ ఓకే అవుతుందనే నమ్మకంను వంశీ పైడిపల్లి సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తున్నాడట. చిరంజీవి వయసుకు తగ్గ స్క్రిప్ట్ ను వంశీ తయారు చేశాడట. వచ్చే ఏడాది తప్పకుండా సినిమాను చేసేందుకు చిరంజీవి డేట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.