మెడికల్ హబ్‌గా హైదరాబాద్…

215
Locals will get all the employment
- Advertisement -

దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజ్ పార్క్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు మంత్రి కేటీఆర్. సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పుర్‌లో మెడికల్ డివైజ్‌ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావుతో కలిసి ప్రారంభించిన కేటీఆర్ దేశానికి వ్యాక్సిన్‌ హబ్‌గా హైదరాబాద్ మారిందన్నారు. మరో 200 ఎకరాల్లో మెడికల్ డివైజ్ పార్క్‌ను విస్తరిస్తామని కేటీఆర్ తెలిపారు. ప్రజలకు ఉపయోగపడని సాంకేతికత వ్యర్ధమని సీఎం కేసీఆర్ ఎప్పుడు చెబుతుంటారని కేటీఆర్ గుర్తుచేశారు.తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు హరీష్ రావు కృషిచేస్తున్నారని …మెడికల్ డివైజ్ భూసేకరణ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎంతో చొరవ చూపారని హరీష్‌కి ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్.

తెలంగాణలో మెడికల్ టూరిజం అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ మెడికల్ డివైజ్‌తో వేలాది ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఉద్యోగ అవకాశాల్లో స్ధానికులకు అవకాశం కల్పించాలని పరిశ్రమల అధిపతులను కోరిన కేటీఆర్… ప్రభుత్వం ఆదిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. చదువుకున్న వారిని తప్పకుండా ఎంకరేజ్ చేస్తామని తెలిపారు. దేశంలో తయారీ రంగంపై దృష్టిసారించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చారని ఆదిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.

మూడేళ్లలో తెలంగాణ ఆందోళన పథం నుంచి అభివృద్ధి పథం వైపు మారడం వెనుక సీఎం కేసీఆర్ అవిశ్రాంత కృషి ఉందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా నిలిచిందన్నారు. మెడికల్ డివైజ్ పార్క్‌తో పాటు ఇన్నోవేషన్ సెంటర్ సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పరిశ్రమలకు ఎప్పుడు సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ మెడికల్ డివైజ్ పార్క్‌తో ఫార్మారంగంలో అగ్రగామిగా ఉన్న తెలంగాణ.. ఇక వైద్యపరికరాల ఉత్పత్తి-పరిశోధన- అభివృద్ధికి వేదిక కానుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లోని 250 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మెడికల్ డివైజెస్ పార్కు దేశంలోనే మొదటిది కానుంది. ఉత్పత్తితోపాటు ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ రంగాలకు ఒకే చోట వేదిక కల్పిస్తూ మెడికల్ డివైజ్ పార్కు ఏర్పాటు చేయడం దేశంలోనే ఇది తొలిసారి. ఈ పార్కు వల్ల దేశీయ వైద్యపరికరాల అవసరాలు తీరడమే కాకుండా 20వేల మందికి ఉపాధి లభిస్తుంది.

- Advertisement -