జూన్ 25న డిస్కవరీలో కాళేశ్వరం ప్రాజెక్టు డాక్యుమెంటరీ…

70
discovery

ప్రపంచంలో అతి పెద్దదయిన ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు మీద డిస్కవరీ చానల్ రూపొందించిన డాక్యుమెంటరీ ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా ప్రసారమవుతుంది. గోదావరి నది మీద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును నదిలో నీరు పారే దిశకు వ్యతిరేక దిశలో వందల కిలోమీటర్ల చొప్పున నీటిని ఎత్తిపోసి పంట పొలాలకు నీరు అందిస్తున్న సంగతి తెలిసిందే ‘లిఫ్టింగ్‌ ఎ రివర్‌’ పేరుతో గంట పాటు సాగే ఈ డాక్యుమెంటరీ శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది.

మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ( ఎం ఈ ఐ ఎల్) సంస్థ 2017లో ఈ ప్రతిష్ఠాత్మకమైన బృహత్తర ప్రాజెక్ట్ మొదలుపెట్టింది. ఆనాటి నుంచి ఇప్పటివరకు జరిగిన పనులను చూపుతూనే, మహా యజ్ఞాన్ని పూర్తి చేసే క్రమంలో ఎదురైన అనుభవాలను ఈ డాక్యుమెంటరీలో చూపిస్తారు. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు సహా ఆరు భారతీయ భాషల్లో ఇది ప్రసారమవుతుంది.