యూకేకి చెందిన లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఐదు వారాల్లోనే తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు లాయిడ్స్ నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణలో వ్యాపార అనుకూలతలు అత్యంత్య నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండటంతోనే హైదరాబాద్‌లో టెక్నాలిజీ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్టు లాయిడ్స్ గ్రూప్ ప్రకటించింది.
టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగంలో గొప్పగా ఎదుగుతున్న హైదరాబాద్ లో టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఖాతాదారులకు దీర్ఘకాలం పాటు సుస్థిరమైన సేవలు అందించేందుకు వీలు కలుగుతుందని లాయిడ్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాన్ వాన్ కేమెనడే తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…హైదరాబాద్‌లో లాయిడ్స్ బ్యాంక్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు. లాయిడ్స్ గ్రూప్‌కు సాదర స్వాగతం పలికారు. గత నెలలో యూకేలో కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందంతో సమావేశమైన అనతి కాలంలోనే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ లో ఉన్న వ్యాపార అనుకూల పరిస్థితులు, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగంలో ఉన్న ఈకో సిస్టంతో టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభించేందుకు లాయిడ్స్ నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Also Read: పొంగులేటి,జూపల్లితో రేవంత్ భేటీ!
హైదరాబాద్ లోని బిఎఫ్ఎస్ఐ ఈకో సిస్టంకు లాయిడ్స్ బ్యాంక్ టెక్నాలజీ సెంటర్ మరింత బలోపేతం చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్థిక సేవలు అందించడంలో యూకే లో టాప్ పొజిషన్ లో ఉన్న లాయిడ్స్ బ్యాంకు కి దాదాపు రెండు కోట్ల 60 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన ఉద్యోగుల నియామక ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు లాయిడ్స్ తెలిపింది. తొలి ఆరునెలల్లోనే 600మందిని లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ నియమించుకోనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు.
Also Read: తెలంగాణ..ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రతీక
Super happy to announce that Lloyds Banking Group, UK's largest financial services provider in retail & commercial segments with over 2.6 Crore customers has chosen to open its Technology Center in Hyderabad
We met with the Lloyds Banking Group earlier this year on May 13th as… https://t.co/Nc80FeOb9D pic.twitter.com/XrxClVWEMD
— KTR (@KTRBRS) June 21, 2023