తెలంగాణ..ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రతీక

34
- Advertisement -

సిద్దిపేట జిల్లా కేంద్రం లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక ఉత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు. ఆలయంలో నిర్వహించిన సుదర్శన హోమం లో పాల్గొని.. జిల్లా లో నూతనంగా మంజూరు అయిన 171 దూప దీప నైవేద్య పథకం మంజూరు పత్రాలను అర్చకులకు అందించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్.. ఈరోజు చాలా సంతోషంగా ఉంది.. ఇంత మంది వేద పండితులు , బ్రాహ్మణోత్తముల ఆశీర్వదం ఎన్నో జన్మల పుణ్యం అన్నారు. – ఒకే చోట ఇంత మంది బ్రాహ్మణులను కలిసే గొప్ప భాగ్యం కలగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇంత మంది ఒకే చోట కల్సిసాము ఆంటే బ్రాహ్మణుల ఆశీస్సులే అన్నారు.

సిద్దిపేట అంటే సిద్ధులు తపస్సు చేసిన నేల అని అంటారు. ఇక్కడ ఏ పని తలపెట్టిన లక్ష్యం చేరుతుందని అంటారు. ఇందుకు సజీవ సాక్ష్యమే మన తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్ర సాధనలో మీ పాత్ర అనిర్వచనియం అన్నారు. ఒకప్పుడు సిద్దిపేట అంటే పందులు, మురికికాలువలు, చెత్త చెదారం , కరువు కాటకాలు, రైతుల ఆత్మహత్యలు, వలసలు గుర్తుకొచ్చేవన్నారు. నేడు సిద్దిపేట అంటే ఆధ్యాత్మికం, ఆరోగ్యం, ఆకుపచ్చదనం, ఆదర్శమైన అభివృద్ధి, అన్నదాత ఆనందం, విద్యాక్షేత్రం, ఉపాధి కేంద్రంగా మారిందన్నారు.

రాష్ట్ర సాధన లో..ఉద్యమం లో మీ పాత్ర గొప్పదన్నారు. గుళ్లు బంజేశారు.. దుప దీప నైవేద్యం లేదు.. అంతటి మీ వేద వాక్.. దైవ సంకల్ప బలం .. ఉంది రాష్ట్రం తెచ్చు కున్నాం.. నేడు అన్ని రంగాల్లో గొప్ప విజయాలను సాదించుకున్నాం అన్నారు. ఆధ్యాత్మిక దినోత్సవం అనే పదం ఒక ఉత్సవమ్ గా జరుపుకుంటున్నాం అంటే రాష్ట్ర సాదించడం.. కేసీఆర్ గారి లాంటి గొప్ప ధార్మిక దార్శనికత కు నిదర్శనం అన్నారు. ఎందుకు అంటే నాకు బాగా గుర్తు ఉంది.. ఆంద్రప్రదేశ్ విచ్చిన్న మస్తు తెలంగాణ రాష్ట్ర ప్రాప్తి రస్తూ అనే బ్రాహ్మణుల వేద వాక్ ..ఆశీర్వద ఫలితం నేడు రాష్ట్ర ఆవిర్భావం అన్నారు.

పదేళ్ల క్రితం ఆధ్యాత్మిక మాట విన్నమా… శతాబ్దపు ఆలయాలను దశాబ్ద కాలం లోనే గొప్ప వైభవాన్ని తీసుకవచ్చాము.. ఏ గుళ్లు చూసిన పురాతన ప్రాచీన ఆలయాలు… శిథిలావస్థకు చేరిన వైనం… కానీ నేడు ఆలయాల కు పూర్వ వైభవం ..ఆధ్యాత్మిక వైభోగం వెల్లి విరుస్తుందన్నారు. ఆలయాల వైభవానికి నాటి యాదగిరి గుట్ట నే.. నేటి యాదాద్రి.. నాడు యదగిరి గుట్టకు పోయే పరిస్థితి ఉండెన.. స్వామి ని ఎంత ఇరుకుటం లో చుసే పరిస్థితి.. తెలంగాణ చారిత్రక ప్రతిపత్తికి, ఆధ్యాత్మిక ఔన్నత్యానికీ పూర్వ వైభవం తేవడం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు.

Also Read:మెగా ప్రిన్సెస్‌ కు తాతల సెంటిమెంట్

ఇదే తరహాలో వేములవాడ, ధర్మపురి దేవాలయాల అభివద్ధి కోసం వందకోట్ల చొప్పున కేటాయించుకున్నాం అన్నారు. భద్రాద్రి రామచంద్రస్వామి దేవాలయం సైతం ఇదేవిధంగా వైభవంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. మన రాష్ట్రంలో కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలచిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించిందన్నారు. ఈ గుర్తింపు వెనుక ప్రభుత్వం చేసిన కృషి ఎంతో ఉందని…- నేడు ప్రపంచ వ్యాప్తంగా మన రామప్ప పేరు ఖ్యాతి గడించిందన్నారు. సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని సందర్శించాలని కోరుకుంటారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కాశీకి వెళ్ళే భక్తుల సౌకర్యార్థం 60 వేల చదరపు అడుగుల్లో అక్కడ ఓ వసతి గృహం నిర్మించబోతున్నది. అదే విధంగా శబరిమల దర్శనం కోసం వెళ్ళే తెలంగాణ భక్తుల కోసం అక్కడ కూడా మరో వసతి గృహం నిర్మిస్తున్నాం అన్నారు.

తెలంగాణ అంటే ఆధ్యాత్మిక…సంస్కృతికి పెట్టింది పేరు… ధార్మిక దార్శనికుడు.. ఆధ్యాత్మికత విలువలు తెల్సిన నాయకుడు కేసీఆర్ గారు కాబట్టే నేడు ఆధ్యాత్మికతకు గొప్ప వైభవం వచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమానికి , రాష్ట్ర సాదనకు తో పాటు ధార్మికతకు , ఆధ్యాత్మికతకు పునాది వేసింది కూడా సిద్దిపేట నే..కేసీఆర్ గారు నాడు సిద్దిపేట లో జరిగిన బ్రహ్మ యజ్ఞం నుండి.. ఇటీవల జరిగిన అయిత చండి యాగం వరకు దైవ భావం కొనసాగుతుందన్నారు.

Also Read:Yoga Day:అంతర్జాతీయ యోగా దినోత్సవం..

ఎంతో మంది పీఠాధిపతులు, స్వాములు పాదా ప్రక్షలన చేసిన పుణ్య భూమి మన సిద్దిపేట అని గుర్తుచేశారు. సిద్దిపేట జిల్లాలో ని ప్రముఖ ఆలయాలు కొండ పోచమ్మ, నాచారం లక్ష్మి నృసింహ స్వామి, గజ్వేల్ రామాలయం, వరద రాజ స్వామి , దుబ్బాక లోని వెంకటేశ్వర స్వామి , రేగుల కుంట మల్లి ఖార్జున స్వామి, హుస్నాబాద్ లో ని రేణుక ఎల్లమ్మ ఆలయం, బెజ్జంకి లోని లక్ష్మి నృసింహ ఆలయం, సిద్దిపేట లోని కొనయ్ పల్లి వెంకటేశ్వర ఆలయం, మన ఈ వెంకటేశ్వర ఆలయం అభివృద్ధి అదేవిధంగా వెంకన్న స్వామి కి బంగారు కిరీటం , శరబేశ్వర , సంతోషి మాత , కోటిలింగాల , పుల్లూర్ లక్ష్మి నరసింహ స్వామి, రంగానాయక స్వామి గుడి ఇలా ఎన్నో ప్రాచీన పురాతన ఆలయాల కు పూర్వ వైభవం తెచ్చి వాటి ప్రాచస్త్యం తీసుక వచ్చామన్నారు. మతం పేరిట మాటలు చెప్పే కేంద్రంలోని బీజేపీ పార్టీ ద్వారా మన తెలంగాణ ఆలయాలకు, అర్చకులకు ఒక్క రూపాయి కూడా వచ్చింది లేదు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. కానీ మానవత్వం తో ఆలోచించే మన ముఖ్యమంత్రి గారు అర్చకుల మనసు తెలిసి ఇదంతా చేస్తున్నారని చెప్పారు.

- Advertisement -