వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతోన్న అవంతిక మిశ్రా..

115
avanthika mishra
- Advertisement -

మోడల్ నుంచి నటిగా మారిన బ్యూటీ అవంతిక మిశ్ర. ఢిల్లీ లో పుట్టి,బెంగళూరు లో చదువుకున్న ఈ భామ తెలుగులో నీలకంఠ దర్శకత్వంలో వచ్చిన ‘మాయ’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. తర్వాత వరుస అవకాశాలతో మీకుమీరే మాకుమేమీ లో మెయిన్ హీరోయిన్ గా నటించింది. అటుపై మీకు మాత్రమే చెపుతా, వైశాఖం, భీష్మ చిత్రాలతో తిరుగులేని గుర్తింపు తెచ్చుకుంది. ఈ గుర్తింపుతోనే ఇప్పుడు తమిళ్ లోనూ అడుగుపెట్టింది అవంతిక. తొలి సినిమా విడుదలకు ముందే మరో రెండు సినిమాల్లో అవకాశాలు అందుకుకుని ఆకట్టుకుంటోంది.

‘ఎన్న సొల్ల పొగరై’ అవంతిక తమిళ్ డెబ్యూ మూవీ. హరిహరన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇది. తర్వాత కాలేజ్ బ్యాక్డ్రాప్ లో సాగే ‘డీ బ్లాక్’ ‘నెంజమెల్లం కాదల్’ సినిమాల్లో నటిస్తూ టాక్ ఆఫ్ ద కోలీవుడ్ అయింది. మరోవైపు తెలుగులోనూ క్రేజీ ఆఫర్స్ ఈ సందర్బంగా అవంతిక మాట్లాడుతూ… ” మంచి సినిమాలు మంచి పాత్రలు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. నటనకు ఎక్కువ అవకాశం ఉన్న ఛాలెంజింగ్ పాత్రలు చేయాలనుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకుల ప్రేమను పొందడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే తమిళ్ ఆడియన్స్ కూడా ఆదరిస్తున్నారు. అందుకే రెండు భాషల్లోనూ నటన కొనసాగిస్తాను” అని చెప్పింది.

ఇక భాషా పరమైన ఇబ్బందులను అడిగితే..” అలాంటిది ఏం లేదు. అయినా కళ కు భాషతో పని లేదు. ఒక నటిగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే నా టార్గెట్ గా భావిస్తాను” అని చెప్పింది ఈ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ అవంతికా మిశ్రా.

- Advertisement -