బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్..

155
Liz Truss
- Advertisement -

బ్రిట‌న్ నూత‌న ప్ర‌ధానిగా ఎన్నిక‌య్యారు లిజ్‌ ట్రస్. బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి హోదాకు పోటీ చేసిన ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంత‌తి నేత రిషి సునక్ ఓడిపోయారు.

త్వరలోనే ట్ర‌స్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటివరకు బ్రిటన్ విదేశాంగ మంత్రిగా లిజ్ ట్రస్ ఉన్నారు. లిజ్ ట్రస్ కు ఈ ఎన్నికల్లో 81,326 ఓట్లు రాగా, రిషి సునక్ కు 60,399 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం 82.6గా నమోదైంది. 20,927 ఓట్ల మెజార్టీతో రిషి సునాక్‌పై లిజ్ ట్రస్ గెలిచారు.

- Advertisement -