డెంగ్యూపై యుద్ధం

79
harishrao
- Advertisement -

డెంగ్యూపై ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సంయుక్త సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇంటింటి జ్వర సర్వేను వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్ఎం సిబ్బంది కలిసి చేయాలని మంత్రులు హరీశ్ రావు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌ రావు…డెంగ్యూ కేసులు హైదరాబాద్ నగర పరిధిలోను, జిల్లాలోను పెరుగుతున్నాయి. ప్రతీ ఐదేళ్లకు ఒక సారి డెంగ్యూ కేసులు పెరుగుతుంటాయి. ఇది ఐదో సంవత్సరం కాబట్టి డెంగ్యూ కేసులు కొంచెం పెరుగుతున్న తీరు గమనిస్తున్నం. కాబట్టి వైద్య ఆరోగ్య పురపాలక,పంచాయతీ శాఖ లు కలిసి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో జులై నెలలో 542 డెంగ్యూ కేసులు ఉంటే ఆగష్టులో 1827 కేసులున్నాయి. బాగా జాగ్రత్తపడాలి. డెంగ్యూకు కారకమైనది.. మంచి నీటి దోమ. ఇవి పగటి పూటనే కుడతాయి. తొట్టిలో, కొబ్బరిచిప్పలు, పాత టైర్లు వంటి వాటిలో పెరుగుతాయని తెలిపిన హరీశ్‌…జీహెచ్ఎంసీలో 1600 మంది ఎటమాలజీ స్టాప్ ఉన్నారు. బాగా పని చేస్తున్నారు. వీరితో పాటు వైద్య ఆరోగ్య సిబ్బంది కలిసి ప్రతీ ఇంటికి వెళ్లి చైతన్యపర్చాలి. ప్రజా ప్రతినిధులు ప్రజలను భాగస్వామ్యం చేయించాలన్నారు.

స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా పది వేల బ్లడ్ యూనిట్లు సేకరించడం జరిగింది. ప్లెట్స్ లేట్స్ సపరేటర్ మిషన్లు అందుబాటులో ఉంచినం. ఎంత బ్లడ్ అవసరమైన ఉచితంగా ఇచ్చేందుకు వైద్యఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రతీ గవర్నమెంట్ ఆసుపత్రుల్లో వైద్యులు, మందులు, ఎక్విప్మెంట్ సిద్ధంగా ఉందని తెలిపారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టి ఉచితంగా ప్రజలకు బ్లడ్ ఇచ్చేలా వైద్య ఆరోగ్య శాఖ తరుపున ఏర్పాట్లు చేస్తాం అన్నారు. దోమల నివారణకు అన్ని చర్యలు చేపట్టాలి. టీవీ, రేడియో మాధ్యమాల ద్వారా బాగా ప్రచారం చేయాలన్నారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే జ్వరపీడితులు బస్తీ దవాఖానాకు వచ్చి పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించాలన్నారు.

గత మూడేళ్లలో ప్రతీ ఆదివారం పది గంటలకు పది నిముషాలు ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమం బాగా చేశాం అని తెలిపారు మంత్రి కేటీఆర్.
హెల్త్ డిపార్ట్మెంట్ , పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది కలిసి పని చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయన్న హరీశ్ రావు గారి మాటకు ఏకీభవిస్తున్నా అని తెలిపారు. జీహెచ్ఎంసీ కమిషనర్లు, జోనల్ ,డిప్యూటీ కమిషనర్లు ఏయే వార్డుల్లో డెంగ్యూ కేసులు ఎక్కువ ఉన్నాయో.. పరిశీలించండి. నివారణకు ప్రత్యేక ప్రణాళిక తయారుచేయాలన్నారు.

రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లోను ప్రణాళిక తయారు చేయాలి. ఆదివారం పది గంటలకు పది నిముషాలు ఇంటిని శుభ్రపరిచే కార్యక్రమం కోసం చిన్న పిల్లలను, మహిళలను ఇంక్లూడ్ చేయాలి. మెప్మాను ఈకార్యక్రమంలో వినియోగించాలన్నారు. విద్యార్థులు, ప్రిన్స్ పాల్స్, టీచర్లు అందరూ పాల్గొని సామాజిక బాధ్యతగా పని చేసేలా కార్యక్రమాలు రూపొందించాలి. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఇళ్లకు స్టిక్కర్స్ అంటించాలన్నారు. డెంగ్యూ దోమలు మురికి నీళ్లలో కాకుండా మంచి నీటిలో ఉంటుంది. వర్షం లేదా ట్యాప్ లలో నుండి వచ్చే నీటిలోను పెరుగుతాయి. ఇలా నీరు నిలువ లేకుండా ఉండేలా చూడాలని తెలిపారు.

స్కూల్ ఎడ్యుకేషన్, మున్సిపల్ డిపార్ట్మెంట్, మెప్మా, విద్యార్థులు, పిల్లలను , ప్రజా ప్రతినిధులను , స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఇందులో భాగస్వామ్యం కావాలి.
లోకల్ గా ఈ కార్యక్రమాలు బాగా ప్రచారం చేయాలి. ఎంటమాలజీ టీం బాగా పని చేస్తుంది. యాంటీ లార్వా ఆపరేషన్లు బాగా చేస్తున్నారు. ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సెలబ్రిటీలను వినియోగించుకోవాలి. రేడియో, లోకల్ టీవీలు, హోర్డింగ్స్ వంటివి పెట్టి ప్రజలను చైతన్యపర్చాలన్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెడదాం. సెప్టెంబర్ 17న క్యాంపులు విరివిగా నిర్వహిద్దాం అని తెలిపారు.

- Advertisement -