లైగర్‌..న్యూఇయర్ ట్రీట్!

105
liger
- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. ఇటీవలె అమెరికా షెడ్యూల్ పూర్తికాగా తాజాగా సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్‌. నూతన సంవత్సరం కానుకగా డిసెంబర్ 31న ఉదయం 10.30 గంటలకు ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషించనుండగా ఇందుకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ సైతం పూర్తయింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మైక్ టైసన్ రాకతో ఈ ప్రాజెక్ట్ అంచనాలు కూడా మారిపోయాయి. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నాయి. థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేస్తున్నారు. విష్ణు శర్మ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మళయాలి భాషల్లో రూపొందిస్తున్నారు.

- Advertisement -