అర్జున్ కపూర్‌కు కరోనా పాజిటివ్!

29
arjun

దేశంలో ఒమిక్రాన్ విజృంభిస్తుండగా కరోనా కేసుల సంఖ్య కూడా స్వల్పంగా పెరిగిపోతోంది. ఇక ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా పంజా విసురుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సినీ,రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు కరోనా బారిన పడగా తాజాగా బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌ కరోనా బారిన పడ్డారు. అర్జున్‌తో పాటు ఆయన సోదరి సోదరి అన్షులా కపూర్‌కు డిసెంబర్ 29న మహ్మమారి సోకినట్లుగా నిర్ధారణ అయింది. ప్రస్తుతం వీరిద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉండగా ఇటీవల తమను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని వారు కోరారు.

అర్జున్ కరోనా బారిన పడటం ఇది రెండోసారి. అర్జున్ కపూర్‌ ప్రేయసీ మలైక అరోరా కొవిడ్‌ పరీక్షలలో నెగెటివ్‌ వచ్చింది. ఈ మధ్యనే అర్జున్-మలైకా ఓ డిన్నర్‌ డేట్‌కు వెళ్లినట్లు సమాచారం. అలాగే రియా కపూర్‌, తన భర్త కరణ్‌ బూలానీకి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని రియా కపూర్‌ తన ఇన్‌స్టా గ్రామ్‌ స్టోరీ ద్వారా షేర్‌ చేసింది.

అర్జున్‌ కపూర్‌ ఇంట్లో నలుగురికి కరోనా రావడంతో బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంటి పరిసర ప్రాంతాలను శానిటైజ్ చేయడంతో పాటు ఎలాంటి రాకపోకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.