ఛార్మితో అఫైర్‌ రివీల్‌ చేసిన పూరి.. ఎమన్నారంటే!

35
puri
- Advertisement -

పంజాబీ ముద్దు గుమ్మ ఛార్మి కౌర్‌ తెలుగులో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించింది. తాజాగా ఛార్మి నిర్మాతగా మారింది. పాథ్ బ్రేకింగ్‌ స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్‌ పేరుతో సినిమాలు చేస్తుంది. తాజాగా విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే హీరో హీరోయిన్‌గా తెరకెక్కిన సినిమా లైగర్‌ సినిమా చేసింది. కాగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు పూరి ఛార్మితో తనకున్న రిలేషన్‌ షిప్‌ను బయటపెట్టారు.

ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఛార్మి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకోచ్చారు పూరీ. ఛార్మి తనకు 13ఏళ్ల వయసప్పటి నుంచి తెలుసని దశాబ్దాలుగా ఆమెతో కలసి పనిచేస్తున్నానని తెలిపారు. ఛార్మికి నాకు ఏదో అఫైర్ ఉందని ఏదేదో మాట్లాడుకుంటున్నారని తెలిసింది. ఆమె యింకా యంగ్‌గా ఉన్నందువల్ల ఇలాంటి పుకార్లు లేస్తున్నాయన్నారు. కానీ తను 50ఏళ్లు ఉంటే ఇలాంటివి మాట్లాడేవారా అని అడిగారు. ఛార్మికి పెళ్లై ఉంటే ఇలాగే మాట్లాడేవారేనా అని మండిపడ్డారు. ఇండస్ట్రీలో ఇలాంటి పుకార్లు లేపడం అంటే అలలు వచ్చి ఎగిసిపడి వెనక్కిపోతుంటాయి లాంటివన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఇద్దరం కలిసి ట్రావెల్‌ అవుతుండటంతో ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ అఫైర్‌ ఉన్నా అది ఎక్కువ రోజులు నిలబడలేదు. ఆకర్షణ అనేది కొన్ని రోజుల్లేనే చచ్చిపోతుంది. స్నేహమే శాశ్వతం తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ పుకార్లకు పూరి ఫుల్‌ స్టాప్‌ పెట్టారు.

- Advertisement -