విజయ్ దేవరకొండ నెక్స్ట్ ఇదే !

78
- Advertisement -

‘లైగర్’ తో డిజాస్టర్ డెలివరీ చేసిన విజయ్ ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో ‘ఖుషి’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సమంత అనారోగ్యం కారణంగా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ సినిమా తర్వాత చేయబోయే నెక్స్ట్ సినిమాను ఎనౌన్స్ చేశాడు విజయ్ దేవరకొండ. జెర్సీ సినిమా తీసిన దర్శకుడిగా ప్రశంసలు అందుకున్న గౌతం తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు విజయ్. విజయ్ పోలీస్ పాత్రలో నటించబోతున్నట్లు ప్రీ లుక్ పోస్టర్ తో ప్రకటించారు మేకర్స్.

ఈ కాంబో సినిమాను సితార ఎంటర్టైన్ మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బేనర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టేజీలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. త్వరలోనే మేకర్స్ మిగతా డీటైల్స్ వెల్లడించనున్నారు.

జెర్సీతో నానిని సరికొత్తగా ప్రెజెంట్ చేసిన గౌతం ఇప్పుడు విజయ్ దేవరకొండ ను ఎలా ప్రెజెంట్ చేస్తాడు ? అనే క్యూరియాసిటీ రౌడీ ఫ్యాన్స్ లో కలుగుతుంది. లవ్ మిక్స్డ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి…

ఊహించినదాని కంటే పెద్ద విజయం…

దసరా షూటింగ్‌ పూర్తి

వరల్డ్‌ టాప్‌ 4లో బాద్‌షా…

- Advertisement -