- Advertisement -
భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ లియాండర్ పేస్ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమక్షంలో తృణమూల్ కండువా కప్పుకున్నారు. పేస్ తనకు సోదరుడి వంటి వాడని వ్యాఖ్యానించారు. తాను యువజన సర్వీసుల మంత్రిగా ఉన్నప్పటి నుంచి పేస్‌తో పరిచయం ఉందని, అప్పుడతను చాలా చిన్నవాడని పేస్ టీఎంసీలోకి రావడం తనకు సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
తనను హిందూ వ్యతిరేకిగా కాషాయ పార్టీ చిత్రీకరిస్తోందని టీఎంసీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆమె పేర్కొన్నారు. టీఎంసీ అంటే టెంపుల్, మసీదు, చర్చ్‌ల కోసం నిలబడే పార్టీ అని తమకు అన్ని మతాలూ ఒకటేనని ఆమె స్పష్టం చేశారు.
గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు పేస్ తృణమూల్‌లో చేరడం ఆ పార్టీలో జోష్ నింపగా రాజకీయ వర్గాల్లో సైతం చర్చనీయాంశంగా మారింది.
- Advertisement -