పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరు..

285
raj
- Advertisement -

ప్రముఖ కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్‌ ఇకలేరు. ఇవాళ ఉదయం ఇంట్లో జిమ్‌ చేస్తోన్న సమయంలో ఆయను గుండెపోటు రాగా వెంటనే కుటుంబసభ్యులు బెంగళూరులోని విక్రమ్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మృతిచెందారు. ఆయన వయస్సు 46. కన్నడ కంఠీరవ, దివంగత రాజ్‌ కుమార్ తనయుడే పునీత్ రాజ్ కుమార్.

బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన పునీత్‌.. అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా పునీత్‌ సుపరిచితమే. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులోనూ డబ్‌ అయ్యాయి.

2002లో ‘అప్పు’ (తెలుగులో ‘ఇడియట్’)తో కథానాయకుడిగా మారారు. నటన మాత్రమే కాకుండా నిర్మాతగానూ సినిమాలు రూపొందించారు.

- Advertisement -