బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేపట్టడం సిగ్గు చేటు..

41

బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేపట్టడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం. ఆయన సోమవారం సోమజిగూడా ప్రెస్ క్లబ్‌లో సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో రిజర్వేషన్ వ్యవస్థ నిర్వీర్యం అవుతుంది, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, కేంద్రం తరపున ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారో బీజేపీ తెలంగాణ రాష్ట్ర బాధ్యులు తరుణ్ చుగ్ సమాధానం చెప్పాలన్నారు.

బీజేపీ పాలిస్తున్న మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పినట్టు ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ, ఆ తర్వాత ఆ ఉసే ఎత్తడం లేదని మండి పడ్డారు. దీనికి ముందు బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేపట్టడం సిగ్గు చేటని, దానికి అర్థం ఏమిటో చెప్పాలని మండి పడ్డారు.

2014 నుంచి రిజర్వేషన్ లను సరిగ్గా అమలు చేస్తున్నారా అనేది బండి సంజయ్ సమాధానం చెప్పాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏటా జరిగే 12 లక్షల ఉద్యోగ నియామకాలు ఎందుకు జరగడం లేదు? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే కుట్ర చేస్తుందని ఆయన ఫైర్ అయ్యారు. ఎల్ఐసి, ఎయిర్ వే, రైల్వే వ్యవస్థలను ప్రైవేట్ పరం చేసి, లక్షల కోట్ల మందిని రోడ్డున పడేసిన పాపం బీజేపీదే అంటూ అర్ఎస్ఎస్, బీజేపీలపై కాంతం మండి పడ్డారు. ఎస్సీ ఎస్టీ బీసీలను అణిచి వేసేలా చేయ్యమని రాముడు చెప్పాడా అని ఫైర్ అయ్యారు.

మాజీ ప్రధాని విపి సింగ్ అనుకున్నట్టు బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, ప్రతిపాదించగా ఆ విపీ సింగ్ ప్రభుత్వాన్ని కూల్చింది బీజేపీ అంటూ విమర్శించారు. బీసీ లెక్కలను ప్రభుత్వం ఎందుకు చెయ్యడం లేదు అని ప్రశ్నించారు. బీసీలకు రిజర్వేషన్ లు ఇవ్వాలని బండి సంజయ్‌ ఢిల్లీలో దీక్ష చెయ్యలని సవాల్ విసిరారు. బండి ఎన్ని కుయుక్తులు పన్నినా, దీక్షలు చేపట్టినా తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. ప్రధానికి, రాష్ట్ర అధ్యక్షులకు, కేంద్ర మంత్రులకు మద్య పొంతన లేదని అన్నారు.

దళిత, గిరిజన, బీసీల కోసం తాము పక్కగా కొట్లడతం అని ప్రధాని మోడీ ఇస్తానన్న రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలని డిమాండ్ చేస్తూ జనవరి 8న ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేయబోతున్నాం అని ప్రకటించారు.దేశ యువత మీద, రైతుల మీద బీజేపీ ఉక్కు పాదం మోపుతున్నరని ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం.