‘వేర్ ఈజ్ ది వెంక‌ట‌ల‌క్ష్మీ’ ఆడియో..

231
- Advertisement -

గురునాథ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ఎ.బి.టి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాయ్ ల‌క్ష్మీ ప్ర‌ధాన పాత్ర‌లో కిషోర్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.శ్రీధ‌ర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్.కె.రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం `వేర్ ఈజ్ ది వెంక‌టల‌క్ష్మీ`. రామ్‌కార్తీక్‌, పూజిత పొన్నాడ హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. హ‌రి గౌడ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జరిగింది. చిత్ర యూనిట్ స‌భ్యులు బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు.

Laxmi Rai

ఈ సంద‌ర్భంగా.. రాయ్ ల‌క్ష్మీ మాట్లాడుతూ-“ఈ చిత్రం మా యూనిట్ అంత‌టికీ చాలా స్పెష‌ల్ మూవీ. సినిమా కోసం మా యూనిట్ అంతా చాలా హార్డ్ వ‌ర్క్ చేశాం. ఎక్కువ యంగ్ టీం ప‌నిచేసింది. చాలా మంది నిర్మాత‌లుంటారు. కానీ సినిమాలంటే ప్యాష‌న్ ఉండే నిర్మాత‌లు అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో శ్రీధ‌ర్ రెడ్డి ఒక‌రు. ఈ సినిమా మేకింగ్‌లో మా యూనిట్‌కు ఆయ‌న అందించిన స‌పోర్ట్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే.

సినిమాలో క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీగా సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది. సినిమాటోగ్రాఫ‌ర్ ఆర్‌.శాఖ‌మూరి అద్భుత‌మైన విజువ‌ల్స్ అందించారు. హ‌రి గౌర ఫేబుల‌స్ సంగీతాన్ని అందించారు. అలాగే రామ్‌కార్తీక్‌, పూజిత పొన్నాడ‌, మ‌ధు నంద‌న్‌, ప్ర‌వీణ్ పాత్ర‌లు స‌హా అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది“ అన్నారు.

- Advertisement -