ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ లో వున్న యంగ్ హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి ఒకరు. తొలి చిత్రం అందాల రాక్షసితోనే తెలుగు ప్రేక్షకుల మనసుల్నిదోచేసింది లావణ్య. అందాల రాక్షసి, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల్లో క్యూట్‌గా నటించి తెలుగింటి అమ్మాయిలా ఒదిగిపోయింది.ఇటీవల శర్వానంద్ హీరోగా వచ్చిన రాధ సినిమాలో రెచ్చిపోయింది లావణ్య. అయితే అనుకున్నది ఒకటయితే.. జరిగింది ఇంకొకటి. తన అందాలే తనకి మైనస్ గా మారాయి. లావణ్యను నిండుగా చూడడానికి అలవాటు పడిన ప్రేక్షకులు బక్కచిక్కికనిపించిన లావణ్యను పెద్దగా ఇష్టపడలేదు. దాంతో ఈ సినిమాలో చేసిన అందాల ప్రదర్శన అంతా వృధా అయిపోయింది అన్నారు సినీ జనాలు.
అయితే క్యూట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న లావణ్య.. స్టార్ హీరోయిన్ అవ్వాలని తెగ ట్రై చేస్తుంది. అంతేకాదు తోటి హీరోయిన్లు ఎడాపెడా హాట్ ఫోటోషూట్‌లతో హాట్ హీరోయిన్స్ అనిపించుకుంటుంటే.. లావణ్యకు మాత్రం ఈ క్యూట్ ట్యాగ్ నచ్చడం లేదట.. హాట్ ట్యాగ్ కోసం నానా తిప్పలు పడుతోంది. ఇటీవల ఓ ఫోటోషూట్‌లో రెచ్చిపోయింది. ఇన్‌స్ట్రాగామ్‌లో ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారుకి సెగలు రేపుతో్ంది లావణ్య.
ప్రస్తుతం లావణ్య చేతిలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే సందీప్ కిషన్‌తో మయవన్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో నాగచైతన్య కృష్ణ మరిముత్తు యుద్ధం శరణంలో ఈ ముద్దుగుమ్మనే తీసుకున్నారు. లావణ్య త్రిపాఠి అందాల ఆరబోతలో ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు తెగ వస్తున్నాయి.